2022 సంక్రాంతి సినిమా ట్విస్ట్ లు ఆగడం లేదు. ఎప్పుడో ఏడాది ముందు రుమాలు వేసిన సర్కారు వారి పాట ఏనాడో తప్పుకుంది.
హడావుడి చేసిన భీమ్లా నాయక్ తప్పుకునేలా చేసారు. పులిలా మీద పడింది ఆర్ఆర్ఆర్. కానీ ట్విస్ట్ లు అక్కడితో ఆగలేదు.
ఇప్పుడు అదే ఆర్ఆర్ఆర్ వెనక్కు వెళ్లిపోయింది. కరోనా మూడో దశ కారణంగా వెనక్కు వెళ్లక తప్పలేదు. దాంతో భీమ్లానాయక్ బరిలోకి దిగుతుందని వార్తలు వచ్చేసాయి. కానీ సాయంత్రానికి మళ్లీ సీన్ మారింది. భీమ్లా నాయక్ నిర్మాతల డిజె టుల్లు రంగంలోకి అధికారికంగా వచ్చేసింది.
మరో పక్కన రాధేశ్యామ్ వుంటుందా వుండదా అన్న అనుమానాలు వుండనే వున్నాయి. ఆర్ఆర్ఆర్ విడుదల పక్కా అనే ఉద్దేశంతో ఆచార్య నెమ్మదిగా వర్క్ చేసుకుంటూ వచ్చింది.
దాంతో సంక్రాంతి చాన్స్ వచ్చినా మిస్ చేసుకుంది. ఇంకా చాలా మిడ్ రేంజ్ సినిమాలు కూడా ఇలాగే సంక్రాంతిని కేవలం ఆర్ఆర్ఆర్ కారణంగా మిస్ చేసుకున్నాయి.
ఈ ట్విస్ట్ లు ఇంతటితో ఆగుతాయా? ఇంకా మరి కొన్ని ట్విస్ట్ లు వస్తాయా? అంటే వస్తాయనే వినిపిస్తున్నాయి. సంక్రాంతి దగ్గర చేసి సరైన ట్విస్ట్ వుంటుందనీ వినిపిస్తోంది.