2022 సంక్రాంతి బరిలోకి దిగడానికి తెగ ఉబలాటపడింది భీమ్లానాయక్ మూవీ. కానీ ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ ల కోసం వెనక్కు తగ్గక తప్పలేదు. నిజానికి సంక్రాంతి బరిలో దిగడానికి భీమ్లా నాయక్ అన్ని విధాలా రెడీ అయిపోయింది. డబ్బింగ్, రీ రికార్డింగ్ అన్నీ పూర్తి చేసుకుంది. రెగ్యులర్ సిజి వర్క్ లు కూడా పూర్తయిపోయాయి.
మరి ఎందుకు సంక్రాంతి బరిలోకి దిగడం లేదు? దీనికి రెండు కారణాలు ఒకటి పవన్ కళ్యాణ్ యంగ్ లుక్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి కాకపోవడం. సినిమాలో చిన్న ఎపిసోడ్ లో పవర్ స్టార్ చాలా యంగ్ లుక్ తో కనిపించాల్సి వుంటుంది. దానికి కాస్త విఎఫ్ఎక్స్ వర్క్ అవసరం. అది కొన్ని కంపెనీలకు అప్పగించారు. ఎప్పుడయితే సంక్రాంతి బరిలోంచి తప్పుకున్నారో, ఆ పని కాస్త స్లో అయింది.
ఇది ఒక కారణం. ఇక రెండో కారణం. అసలు పరిస్థితులు ఎలా వుంటాయో తెలియవు. తీరా డేట్ వేసి పోస్ట్ పోన్ అంటే మళ్లీ మరోసారి అభాసు అయినట్లు అవుతుంది. అలా అని 14 డేట్ ను వదలడం ఇష్టం లేదు. అందుకే సితార సంస్థ తన బ్యానర్ లో నిర్మించిన డిజె టుల్లు ను ముందుకు నడిపింది. ఇప్పుడు ఆ డేట్ ఆ సంస్థకు లాక్.
డిజె టుల్లు వేసుకున్నా, భీమ్లానాయక్ వేసుకున్నా ఏదైనా వేసుకోవచ్చు. పైగా భీమ్లా నాయక్ విడుదల మరీ పది రోజుల ముందు ప్రకటించాల్సిన పని లేదు. దానికి రావాల్సిన బజ్ వచ్చేసింది. జస్ట్ వస్తోంది అని తెలిస్తే చాలు.