Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సంక్రాంతికి నాలుగో సినిమా

సంక్రాంతికి నాలుగో సినిమా

సంక్రాంతి బరిలోకి నాలుగో సినిమా కూడా వస్తోందని దాదాపు ఫిక్స్ అయిపోయింది. కళ్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచి వాడవురా' సినిమాను ముందు అనుకున్నట్లే జనవరి 15న విడుదల చేయాలని దాదాపు ఫిక్స్ అయినట్లు బోగట్టా. సంక్రాంతి పోటీ హడావుడి, వెంకీమామ వస్తుందనే ప్రచారం చూసి, కళ్యాణ్ రామ్ సినిమాను జనవరి మూడోవారానికి తీసుకెళ్లాలని అనుకున్నారు.

కానీ వెంకీమామ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. తేలినా జనవరి పోటీలోకి వచ్చే ధైర్యం చేయడంలేదు అని టాక్ వినిపిస్తోంది. దాంతో తాము అనుకున్న డేట్ కే రావాలని ఎంత మంచివాడవురా యూనిట్ డిసైడ్ అయినట్లు బోగట్టా.

10 నుంచి 12 నుంచి పెద్ద సినిమాలు వచ్చేస్తాయి కనుక, మూడురోజులు గ్యాప్ ఇచ్చి 15న రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బిజినెస్ స్టార్ట్ చేసారు. ఆంధ్ర 8 కోట్ల రేషియోలో విక్రయిస్తున్నారు. వైజాగ్ గాయత్రీ ఫిలింస్ కు క్లోజ్ చేసారు. ఈరోజు ఈస్ట్ గోదావరి వింటేజ్ కు క్లోజ్ చేస్తున్నారు.

గుజరాతీలో హిట్ అయిన సినిమా ఆధారంగా తయారవుతున్న పక్కా ఫ్యామిలీ మూవీ ఎంత మంచివాడవురాను ఆదిత్య మ్యూజిక్ సంస్థ శివలెంక కృష్ణ ప్రసాద్ తో కలిసి నిర్మిస్తోంది.

సినిమా రివ్యూ: రాజుగారి గది 3

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?