Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సంక్రాంతికి సీన్ రిపీట్ ?

సంక్రాంతికి సీన్ రిపీట్ ?

గడచిన సంక్రాంతికి మూడు భారీ సినిమాలు పోటా పోటీ..ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలయ్య డిక్టేటర్, నాగ్ సోగ్గాడే చిన్ని నాయనా పోటా పోటీగా విడుదలయ్యాయి. వీటి మధ్య శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా వచ్చింది. ఈ సారి కూడా అదే విధంగా అటు శాతకర్ణి, ఇటు ఖైదీ 150 వస్తుంటే, మధ్యలో మళ్లీ శర్వానంద్ వస్తున్నాడు.

లాస్ట్ సంక్రాంతికి ఏం జరిగింది? బాలయ్య సినిమాకు, ఎన్టీఆర్ సినిమాకు పోటీ పడింది. థియేటర్ల దగ్గర నుంచి మొదలైంది వ్యవహారం. ఈసారి అదే టైపు వ్యవహారం శాతకర్ణి కి ఖైదీకి మధ్య నడుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా సింగిల్ థియేటర్లను బాలయ్య సినిమా కోసం బ్లాక్ చేస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. 

జరిగాయో లేవో కానీ, ఎన్టీఆర్ సినిమాను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారన్న వదంతులు వ్యాపించడంతో సహజంగానే నాన్నకు ప్రేమతో సినిమాకు ఓ రకమైన సింపతీ వచ్చేసింది. ఇప్పుడు కూడా ఖైదీ నెంబర్ 150 ని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారన్న వదంతులు వినిపిస్తున్నాయి. ఖైదీ ఫంక్షన్ కు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న విషయం అందులో ఒకటి. దీనివల్ల ఖైదీ సినిమాకు సింపతీ వచ్చే అవకాశం వుంది. ఇప్పటికే విజయవాడ సభ క్యాన్సిల్ కావడం, గుంటూరుకు వెన్యూ మారడంపై ఫ్యాన్స్ నడుమ సోషల్ నెట్ వర్క్ లో మాటలవార్ స్టార్ట్ అయింది. 

మొత్తానికి వ్యవహారాలు అన్నీ చూస్తుంటే మళ్లీ సంక్రాంతి సీన్ మరోసారి చూస్తున్నట్లు అనిపిస్తోంది.

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?