నోరా వీపుకు తేకే.. అన్నది సామెత. మన నోరు తిన్నగా వుంటే ఏ తన్నులు వుండవు అన్నది మీనింగ్. ఫేమస్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పరిస్థితి ఇప్పుడు అలాగే అయింది. ఇతగాడు ట్విట్టర్ లో కాస్త హుషారుగానే వుంటాడు. అయితే అనుకోకుండా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు పెద్ద కల్లోలంగా మారేలా వుంది తమిళ ఇండస్ట్రీలో.
ఇంతకీ ఆ పోస్ట్ ఏమిటంటే ఒకే కుక్క మొహం రెండు రకాలుగా. ఒకటి చికాగ్గా పళ్లు బయటకు పెట్టి. రెండోది కాస్త ముద్దుగా, సిగ్గుపడుతున్నట్లు. ఆ రెండు ఫొటోలకు రెండు క్యాప్షన్లు. మొదటి దానికి, నిర్మాతలు, టెక్నీషియన్లకు డబ్బులు ఇచ్చేటపుడు, రెండోదానికి, నిర్మాతలు హీరోయిన్లకు డబ్బులు ఇచ్చేటపుడు. అని.
దాన్ని ఓ నిర్మాత చూసి, తమిళ నిర్మాతల మండలికి పంపించారు. దాంతో అక్కడి మండలి కార్యవర్గం ఈ రోజు అత్యవసరంగా సమావేశం అవుతోంది. కానీ కొసమెరుపు ఏమిటంటే, సంతోష్ శివన్ ఆ ట్వీట్ ను అర్జెంట్ గా డిలీట్ చేసేయడం. కానీ అప్పటికే ఆ ట్వీట్ స్క్రీన్ షాట్ బాగానే చలామణీ అయిపోయింది నిర్మాతల వాట్సాప్ లో.