బాలీవుడ్ హీరోల కూతుర్లలో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన వారిలో సారా అలీఖాన్ ఒకరు. లీడింగ్ హీరో సైఫ్ అలీఖాన్, అలనాటి తార అమృతా సింగ్ ల గారాల పట్టి సారా. యుక్తవయసుకు వచ్చిన సారా హీరోయిన్ గా వస్తుందా? తల్లిలా హీరోయిన్ గా మారుతుందా? తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తుందా? అనేది ఒక పెద్ద చర్చనీయాంశమే. శ్రీదేవి తనయ జాన్వీ తర్వాత బాలీవుడ్ మూవీ మేకర్లలో ఆసక్తిని రేపుతున్నది సారా మాత్రమే. అలాగే పటౌడీల ఫ్యామిలీలో అమ్మాయిలు సినిమాల్లోకి రావడం కొత్తేమీ కాదు.
సైఫ్ తల్లి షర్మిలా టాగోర్ ఒకనాటి హీరోయిన్, సైఫ్ చెల్లెలు సోహా కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఈ నేపథ్యంలో అమృత, సైఫ్ ల కూతురు హీరోయిన్ గా వస్తుందనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు సారాకు సంబంధించిన కొన్ని పిక్స్ ఆసక్తికరంగా మారాయి.
తన బాయ్ ఫ్రెండ్ తో సన్నిహిత క్షణాల్లో సారా ఫొటోలు దిగింది. ఆమె బాయ్ ఫ్రెండ్ మరెవరో కాదు.. మాజీ కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. వీర్ పహారియా. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వీళ్లు ప్రస్తుతం కలిసే ఉంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వీళ్ల ఫొటోలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. హీరోయిన్ గా వస్తుందో లేదో కానీ.. ఈ ప్రేమ కథతో మాత్రం సారా ట్రెండింగ్స్ లోకి వచ్చేసింది!