సరైనోడు సినిమా ఈ రోజు ఒక్కసారి నెట్ వార్తల్లోకి వచ్చింది. బోయపాటి తో అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలు వున్నాయి. అయితే ఇటీవల కథ కాస్త బయటకు వచ్చింది. పెద్ద గొప్పగా, కొత్తగా లేదని స్పష్టమయింది. పైగా తెలుగునాట పెద్దగా క్రేజ్ లేని ఆది ని విలన్ గా ఫిక్స్ చేసి చేస్తున్న సినిమా ఇది. సినిమా విడుదలైతే తప్ప ఆ నిర్ణయం ఎలాంటి ఫలితం ఇస్తుందో తెలియదు. జగపతి బాబు లాంటి అనుభవం పండిన నటుడు విలన్ గా మారితే అది వేరే సంగతి. మరి ఆది ఎలా చేసాడో చూడాలి.
ఇలా కథ, విలన్ అంత ఆసక్తి కరం కాని నేపథ్యంలో మరో ఆసక్తి కరమైన గ్యాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ అంటే సూపర్ గా వచ్చిందని, బోయపాటి తన టాలంట్ అంతా చూపించి హీరోను సూపర్ గా ఎలివేట్ చేసాడని అంటున్నారు.
అయితే అదే సమయంలో ఫస్టాఫ్ సూపర్ హైఫై రేంజ్ లో సెకండాఫ్ వుండడం కష్టమన్నది ఆ గ్యాసిప్ సారాంశం. సాధారణంగా ఫస్ట్ హాఫ్ ను చకచకా నడిపి, సెకండాఫ్ కథలోకి ప్రవేశించాక, నడక స్లో అవడం అన్నది కామన్. అయితే ఈ గ్యాసిప్ నిజం కాదని, సెకండాఫ్ కూడా ట్విస్ట్ లతో సూపర్ గా వుంటుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో సరైనోడు నుంచి ఈ రోజు ఓ ప్రకటన వచ్చింది. సరైనోడు పాటను అక్రమంగా నెట్ లో చలామణీ చేసినా, ఇతరత్రా వ్యవహారాలకు పాల్పడనా చర్యలు తీసుకుంటామంటూ..అదేంటీ అని అడిగితే ఓ పాట లీక్ అయిందని, వాట్సప్ లో చలామణీ అవుతున్నట్ల తమ దృష్టికి వచ్చిందని అంటున్నారు. కానీ అలావచ్చి వుంటే, ఈపాటికి చాలా మందికి చేరిపోయి వుండాలి. కానీ అలా ఎక్కడా చేరిన దాఖలాలు లేవు. అభిమానులకు మాత్రమే చేరిందంటున్నారు.
అభిమానులు కూడా ఊరికనే వుంచరు కదా..ఈపాటి వేలాది మందికి చేర్చేసి వుండాలి. కానీ అలా జరిగినట్లు కనిపించడం లేదు. అయినా అదేమంత ఇస్యూ అనుకోవడానికి లేదు. ఇలా పాటలు విడుదలయ్యాయి అంటే అలా పాకిపోతాయి. ఒక చరణమో, రెండు లైన్లో బయటకు వచ్చాయి అనుకున్నా అది సినిమాకు ప్లస్సే అవుతుంది కానీ మైనస్ కాదు.
ప్రస్తుతం టీమ్ మొత్తం విదేశాల్లో వుంది.అక్కడి నుంచి వస్తే తప్ప,అడియో ఫంక్షన్ డిసైడ్ కాదు. ఇప్పటి నుంచి సినిమాకు హైప్ తేవాల్సి వుంది. ఇంక విడుదల ఎన్నాళ్లో లేదు. అడియో ఫంక్షన్ వరకు పబ్లిసిటీని పక్కన పెడితే ఎలా? అందుకే ఈ టైపు పబ్లిసిటీ ప్రారంభించారేమో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.