అదేంటి మేడమ్.. మీరు ఎన్నో పేరున్న సినిమాల్లో నటించారు… కానీ అదే సమయంలో ద్వితీయ శ్రేణి సినిమాల్లో చేయడానికి వెనుకాడటం లేదు.. అని కొంతకాలం కిందట ఒక నటీమణిని అడిగితే.. ఆమె చాలా తాత్విక చింతనతో.. సమాధానం ఇచ్చింది. ఆమె కెరీర్ గురించి రివ్యూ చేస్తూ.. అడిగిన ప్రశ్నకు అడిగిన వారి తల తిరిగేలా సమాధానం చెప్పింది.
ఇంతకీ ఆమె సమాధానం ఏమిటంటే…”భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని ఎలా ఉపయోగిస్తే కాని ఏం తప్పు అవుతుంది? దాన్ని తెరపై ప్రదర్శిస్తేనో.. మరొకరికి అప్పగిస్తేనో… తప్పు అవుతుందా? ఏది తప్పు.. ఏది రైటు.. నా శరీరాన్ని నాకు ఇష్టమైనట్టుగా వాడుకోవడంలో ఈ సృష్టిలోని ఎవరికీ అభ్యంతరం ఉండదు, ఉండకూడు..'' అని తేల్చి చెప్పింది ఆమె!
ఒక లేడీ ఓషోలా మాట్లాడింది ఆమె. అయితే ఆమె కమర్షియల్. విలువలు.. వంకాయలు ఉట్టివేనని.. శరీరం ఉంది, శరీరానికి ఆకర్షణ ఉంది, దాన్ని అడ్డం పెట్టుకుని సంపాదిస్తే తప్పేముంది? శారీక సంబంధాలతోనైనా ఎంజాయ్ చేస్తే.. అడ్డేముంది? అని ఎదురు ప్రశ్నించింది.
ఇంత బోల్డ్ గా మాట్లాడిన ఆమె తెలుగు తెరపై ఫ్యామిలీ తరహా పాత్రల్లో మంచి గుర్తింపు ఉన్న నటి 80 లలో హీరోయిన్ గా నటించి.. ఆ తర్వాత హీరోలకు, హీరోయిన్లకు తల్లి, ఆంటీల పాత్రల్లో కనిపించింది. రాజకీయంగా కూడా కొంత హడావుడి చేసింది.
ఆమె ఒక దశలో మలయాళ ద్వితీయ శ్రేణి చిత్రాల్లో కూడా నటించింది. మల్లూవుడ్ లో రూపొందే బి గ్రేడ్ మూవీస్ లో నటిస్తూ ఆశ్చర్యపరిచింది. ఆ విషయం గురించి అడిగితే..గతం గురించి గుర్తు చేస్తే.. మీరు ఎందుకలా చేయాల్సి వచ్చింది.. అంటే… అందులో తప్పు ఏమీ లేదు, ఎవ్వరూ జాలి చూపాల్సిన అవసరంలేదు, ఈ శరీరాన్ని అలా అప్పగించడంలో తప్పేమీ లేదు. అని ఆమె తేల్చి చెప్పింది.
మరి ఏదో నటించడం కాదు.. ఆమె ఫిలాసఫికల్ గా కూడా ఆ మేరకు మౌల్డ్ అయిపోయి.. అదే వేదాంతాన్ని చెప్పండం నిజంగా గ్రేటే!