మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా కోసం ఆ మధ్య వెరైటీ మీసకట్టుని ట్రై చేసిన విషయం విదితమే. అయితే, సినిమాలో ఆ మీసకట్టు వుంటుందా.? లేదా.? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. జస్ట్ ఆ లుక్ అప్పట్లో ట్రై చేశారంతే.. అనుకోవాలేమో.! ఇక, 'తని ఒరువన్' తెలుగు రీమేక్‌లో రామ్‌చరణ్ కూడా దాదాపు అలాంటి మీస కట్టులోనే కనిపించనున్నాడంటూ ప్రచారం జరిగింది. అయితే, ఇంకా ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా ఎలాంటి 'లుక్' బయటకు రాలేదు.
తాజాగా, పవన్‌కళ్యాణ్ కూడా అతే తరహా మీసకట్టుతో కనిపిస్తున్నారు. లండన్‌లో పర్యటించిన పవన్‌కళ్యాణ్, ఇలా (పై ఫొటోలో వున్నట్లుగా) కన్పించడంతో, పవన్ తన తదుపరి సినిమాలో ఇదే గెటప్‌తో కనిపిస్తాడని అభిమానులు డిసైడ్ అయిపోయారు. సెలబ్రిటీలు ఇటీవలి కాలంలో కుప్పలు తెప్పలుగా వెరైటీ గెటప్స్ ట్రై చేస్తున్నారు. అందులో ఏది ఫైనల్ అవుతుందో సినిమా విడుదలయ్యేదాకా చెప్పలేని పరిస్థితి.
మిగతా హీరోల సంగతెలా వున్నా, బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి, పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్ ఒకే తరహా మీసకట్టుతో కనిపించి, తమ తదుపరి సినిమాల్లో ఇదే లుక్.. అన్నట్లుగా గాసిప్స్‌కి ఆస్కారం కల్పించడమే విశేషమిక్కడ. ఎస్‌జె సూర్య సినిమా అటకెక్కడంతో, డాలీ సినిమాని రంగంలోకి దించిన పవన్, ఆ కథ విషయంలోనూ అసంతృప్తితో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాని ఖరారు చేసే ఆలోచనలో వున్నాడు. వీటితోపాటుగా, మరో యువ దర్శకుడితోనూ పవన్ సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అందుకేనేమో, లుక్ విషయంలో పవన్ ఇన్ని గెటప్స్ ఛేంజ్ చేస్తున్నాడు.! ఎస్‌జె సూర్య కోసం తెల్లగడ్డంతో కనిపించాడు, ఆ తర్వాత హ్యాండ్సమ్ లుక్‌కి ఓటేశాడు, ఇప్పుడేమో మళ్ళీ 'కొమరం పులి' సినిమా నాటి గెటప్ కోసం ట్రై చేస్తున్నాడు. ఏంటి పవన్‌కళ్యాణ్ మీసకట్టు కథ.? ఏమో మరి, ఆయనకే తెలియాలి.