Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'సరిలేరు'లో మళ్లీ ఫ్రెండ్ కీలకం?

'సరిలేరు'లో మళ్లీ ఫ్రెండ్ కీలకం?

స్నేహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతం అన్నారు. ప్రెండ్ షిప్ ఈజ్ ఫరెవర్ కదా? అందుకే మహర్షి సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్, ప్రెండ్ షిప్ అన్న పాయింట్ కీలకం అయింది. ఫ్రెండ్ గా అల్లరి నరేష్ జీవించేసాడు. ఇప్పుడు అదే మహేష్ బాబు లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరూ లో కూడా ఓ మాంచి ఫ్రెండ్ క్యారెక్టర్ వున్నట్లు తెలుస్తోంది.

అప్ కమింగ్ హీరో, మంచి నటన కనబర్చే సత్య ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ ను చేస్తున్నట్లు తెలుస్తోంది. జ్యోతి లక్ష్మి సినిమా నుంచి లేటెస్ట్ గా రాబోతున్న 'రాగల 24 గంటల్లో' వరకు సత్య అనేక వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వస్తున్నాడు. అతగాడికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కూడా మంచి ఫ్రెండ్ పాత్ర దొరికినట్లు తెలుస్తోంది.

కథలో కీలక మలుపు, కథ కీలకంగా బేస్ అయ్యేది ఈ ఫ్రెండ్ పాత్ర మీదే అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పైగా సినిమాలో హీరో పేరు, ఫ్రెండ్ పేరు ఒకటే వుంటాయని టాక్. సాధారణంగా మహేష్ కు ఇష్టమైన హీరో క్యారెక్టర్ పేరు పోకిరి లోని అజయ్ కృష్ణ. బహుశా మళ్లీ ఆ పేరే వాడతారేమో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కూడా. 

ఏమైనా దర్శకుడు అనిల్ రావిపూడి కథలో చమక్కులు చేయడంలో దిట్ట. అందువల్ల ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ తో ఆయన ఏ చమక్కు చేయబోతున్నారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?