Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సర్కార్: అటు వసూళ్లు.. ఇటు వివాదాలు

సర్కార్: అటు వసూళ్లు.. ఇటు వివాదాలు

విజయ్-మురుగదాస్ కాంబోలో తెరకెక్కిన సర్కార్ సినిమాకు తమిళనాట మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ వసూళ్లలో మాత్రం ఈ సినిమా దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే వందకోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమాపై వివాదాలు కూడా అదే రేంజ్ లో చెలరేగుతున్నాయి. విడుదలకు ముందు కథాపరంగా వివాదాలు ఎదుర్కోగా.. రిలీజ్ తర్వాత కంటెంట్ పై దుమారం రేకెత్తిస్తోంది సర్కార్. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు అన్నాడీఎంకే పార్టీని కించపరిచేలా ఉన్నాయంటూ మంత్రి కదంబు రాజు ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్నారు.

అందులో చాలా సన్నివేశాల్ని తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు, తమిళనాడు ప్రభుత్వ ప్రతిష్టను, విధానాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ దేవరాజన్ అనే వ్యక్తి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తను ఎంపిక చేసిన కొన్ని సన్నివేశాల్ని తొలిగించాలని డిమాండ్ చేశాడు.

ఈ సినిమాలో మిక్సీలు, టీవీలు తగలబెట్టే సీన్ ఒకటుంది. ఆ సన్నివేశంలో స్వయంగా దర్శకుడు మురుగదాస్ కూడా నటించాడు. మరో సన్నివేశంలో ముక్కుపుడకకు ఓటు అమ్మేద్దామా అంటూ విజయ్ ప్రశ్నిస్తాడు. ఇంకో సన్నివేశంలో తను తలుచుకుంటే ఒక్క రాత్రిలోనే మార్పు వస్తుందని డైలాగ్ కొడతాడు.

ఇవన్నీ అన్నాడీఎంకే పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. గతంలో జయలలిత ఉచితంగా మిక్సీలు, టీవీలు ఇచ్చారు. వాటినే సినిమాలో తగలబెట్టడం వివాదానికి కారణమైంది. మరోవైపు సినిమాలో విలన్ పాత్రధారి వరలక్ష్మికి కోమలవల్లి అనే పేరుపెట్టారు.

ఇది జయలలిత అసలు పేరని, ఆమెకు వ్యతిరేకంగా కావాలనే విలన్ పాత్రధారికి ఈ పేరు పెట్టారంటూ మరో ప్రచారం కూడా తమిళనాట ఊపందుకుంది. జయలలితకు కోమలవల్లి అనే పేరు లేదని, కనీసం ఆమె సినిమాల్లో కూడా అలాంటి పాత్ర పోషించలేదని పలువురు విశ్లేషకులు వివరణ ఇచ్చినప్పటికీ దుమారం మాత్రం తగ్గలేదు.

సినిమాపై ఇన్ని వివాదాలు చెలరేగుతున్నప్పటికీ, సర్కార్ యూనిట్ మాత్రం వీటిపై స్పందించడం లేదు. ప్రస్తుతానికైతే మురుగదాస్, విజయ్, కీర్తిసురేష్, వరలక్ష్మి.. ఇలా కీలకమైన సభ్యులంతా ఎంజాయ్ మెంట్ మూడ్ లో ఉన్నారు.

ఇప్పుడీ వివాదాలకు తోడు సర్కార్ సినిమా పైరసీకి కూడా గురైంది. కనీసం పైరసీని అరికట్టండంటూ యూనిట్ పిలుపు కూడా ఇవ్వడంలేదు. ఎందుకంటే పైరసీ కోసం బయటకొస్తే వివాదాలపై స్పందించాలి కాబట్టి.

జగన్ ను పరామర్శించాడు.. జంప్ కూడా చేస్తాడా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?