Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ముదురు హీరోయిన్ కీ పెళ్లిపై గాలి మళ్లిందా!

 ముదురు హీరోయిన్ కీ పెళ్లిపై గాలి మళ్లిందా!

మగాళ్లు చాలా సంవత్సరాల పాటు పెళ్లి చేసుకోకపోతే.. ముదురు బ్రహ్మచారులు అంటుంటారు. మరి ఆడవాళ్లకు ఈ మాట చెల్లుతుందో లేదో కానీ.. ఇప్పుడు సుస్మితా సేన్ కు కూడా పెళ్లి మీద గాలి మళ్లిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ మాజీ మిస్ యూనివర్స్ వయసు నలభై రెండు సంవత్సరాలు. ఇప్పటికే పెళ్లి చేసుకుని సెటిలైన ముప్పై యేళ్ల కుర్రాళ్లు పుట్టే సమయానికే సుస్మిత వయసు పన్నెండేళ్లు.

ఇప్పుడు తండ్రులైన చాలామంది కుర్రాళ్లు కిడ్స్ గా ఉన్నప్పుడే సుస్మిత మిస్ యూనివర్స్ గా నిలిచింది. అలా మిస్ గానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఈమె మిసెస్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సేన్ పెళ్లి కూతురు కాబోతోందట.

రోహ్ మన్ షాల్ అనే ఫ్యాషన్ మోడల్ ను సుస్మిత పెళ్లి చేసుకోబోతోందని సమాచారం. సుస్మితకు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయినా.. మోడలింగ్, ఫ్యాషన్ వరల్డ్ లో మాత్రం ఎంచక్కా కొనసాగుతూ ఉంది. అక్కడే రోహ్ మన్ పరిచయం అయ్యాడట. ఈ నేపథ్యంలో వీరిద్దరూ చాన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ డేటింగ్ ఇప్పుడు పెళ్లిగా మారబోతోందట.

త్వరలోనే ఈ జంట పెళ్లి కబురు చెప్పబోతోందని సమాచారం. ఇక షరా మామూలుగా సుస్మిత కూడా తన కన్నా వయసులో చిన్నవాడినే పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఉంది. ఈమె వయసు ఇప్పటికే నలభై రెండు కాబట్టి.. ఆపై వయసు వాడు పెళ్లికి దొరికే ఛాన్సులు లేవు. ఈ నేపథ్యంలో తనకన్నా చిన్నవాడే అయిన వరుడిని వరించబోతోంది ఈ మాజీ మిస్ యూనివర్స్.

జగన్ ను పరామర్శించాడు.. జంప్ కూడా చేస్తాడా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?