శర్వా-సుధీర్ సినిమా వెనక్కి?

శర్వానంద్ తో సినిమా చేయడం కోసం సుధీర్ వర్మ కిందా మీదా అవుతున్నారు. మణిరత్నం నాయకుడు సినిమా లాంటి కథను శర్వా కోసం రెడీ చేసారు. సామాన్యుడు మాఫియా డాన్ గా ఎదిగిన బయోపిక్…

శర్వానంద్ తో సినిమా చేయడం కోసం సుధీర్ వర్మ కిందా మీదా అవుతున్నారు. మణిరత్నం నాయకుడు సినిమా లాంటి కథను శర్వా కోసం రెడీ చేసారు. సామాన్యుడు మాఫియా డాన్ గా ఎదిగిన బయోపిక్ లాంటిదన్నమాట. శర్వానంద్ దాదాపు ఓకె అయ్యారు. కానీ నిర్మాతలయిన హారిక హాసిని వాళ్లు మాత్రం చిన్న చిన్న ఛేంజెస్ అడిగినట్లు టాక్. 

ఇదిలా వుంటే ఈ లోగా ఈ నెల 23నుంచి శర్వా కొత్త సినిమాను స్టార్ట్ చేసేస్తున్నాడు. హను రాఘవపూడి డైరక్టర్. శర్వానంద్ ఒకసారి ఒక సినిమా చేయడమే గగనం. అంత లీజర్ గా చేయడం శర్వాకు అలవాటు. ఒకేసారి రెండు సినిమాలు అన్నది అతనికి అంతగా నచ్చదు. స్మూత్ గా, లీజర్ గా సినిమాలు చేయాలని అనుకుంటాడు. అందువల్ల ఈ సినిమా అయితే తప్ప సుధీర్ వర్మ సినిమా చేయకపోవచ్చు.

హను రాఘవపూడి సినిమా కనీసం మూడు నెలల పైనే పడుతుంది. అంటే మరో మూడు నెలల దాకా సుధీర్ వర్మ సినిమా వుండదా? లేక మధ్యలో ఏమన్నా ముహుర్తం చేసి, అప్పుడు అప్పుడు గ్యాప్ లో చేయడానికి శర్వాను ఒప్పిస్తారా? ఏమో. చూడాలి.