Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శర్వానంద్ సినిమాకు డేట్ ఏదీ?

శర్వానంద్ సినిమాకు డేట్ ఏదీ?

మొత్తానికి శర్వానంద్ సినిమా పూర్తయినా, డేట్ దొరకని చిక్కుల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. వరుసగా సినిమాలు దాడి చేస్తుండడంతో, శర్వా-సుధీర్ వర్మ సినిమాకు డేట్ లేకుండా వుంది. వాస్తవానికి క్రికెట్ మ్యాచ్ లకు భయపడి జూన్ అంతా వేస్ట్ చేసుకున్నారు. 

జూలై తొలిసగం కూడా ఇలాగే వదిలేసారు. కానీ ఇప్పుడేమయింది. జూలై మూడోవారంలో డియర్ కామ్రేడ్ వస్తోంది. ఆగస్ట్ 9న నాగ్ మన్మధుడు 2కి డేట్ ఇచ్చారు. ఆ తరువాత సాహో వుంది. కాస్త గ్యాప్ ఇచ్చి నాని గ్యాంగ్ లీడర్ వస్తోంది. మిగిలినవి రెండే డేట్ లు, ఆగస్టు 2వ తేదీ. కానీ ముందువారం డియర్ కామ్రేడ్. వెనుకవారం మన్మధుడు 2. అందువల్ల ఈ డేట్ ఫిక్స్ చేస్తారా? అన్నది అనుమానం.

ఇక ఏకంగా 23కు వెళ్లాలి. కానీ ముందువారం సాహో. వెనుకవారం గ్యాంగ్ లీడర్ వుంటాయి. కాదూ అంటే సెప్టెంబర్. మొత్తానికి సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల శర్వానంద్ సినిమాకు సరైన డేట్ లేకుండా అయిపోయింది. సుధీర్ వర్మ సినిమాను చెక్కుతూ వస్తున్నారు.

అదే కనుక కాస్త ముందుగా ప్లాన్ చేసివుంటే మే నెలలో వచ్చి వుండే అవకాశం వుండేది. అది మిస్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏ డేట్ ఫిక్స్ చేస్తారో చూడాలి?

పవనమా? ఋతుపవనమా? ఈ పవనమెటు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?