శర్వానంద్ @ మూడు కోట్లు

రన్ రాజా రన్ నుంచి కెరీర్ పరుగులు పెడుతోంది శర్వానంద్ కు. మరి నాచురల్ గా రేటు కాస్త పెరుగుతుంది కదా..మొన్నటికి మొన్న శర్వానంద్ ను మీడియా అదే విషయం అడిగితే, తను అడగడం…

రన్ రాజా రన్ నుంచి కెరీర్ పరుగులు పెడుతోంది శర్వానంద్ కు. మరి నాచురల్ గా రేటు కాస్త పెరుగుతుంది కదా..మొన్నటికి మొన్న శర్వానంద్ ను మీడియా అదే విషయం అడిగితే, తను అడగడం లేదని, నిర్మాతలే పెంచుతున్నారని టక్కున సమాధానం చెప్పాడు. 

కానీ అసలు విషయం..శర్వానే స్లోగా పెంచుకుంటూ వెళ్తున్నాడని టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఎక్స్ ప్రెస్ రాజాకు యువి దగ్గర శర్వా రెండు కోట్లు పారితోషికం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు మూడు అడుగుతున్నాడట. త్వరలో చేయబోయే ఓ సినిమాకు మూడు అడుగుతుంటే.. బేరాలు రెండున్నర దగ్గర నుంచి ప్రారంభమయ్యాయట. 

రెండు డెభై అయిదన్నా కావాలని శర్వా అంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయినా తప్పే ముంది? దీపం వుండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా?