ఆర్ఎక్స్ 100తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి. కానీ ఆ తరువాత సినిమా ఎంతకూ సెట్ మీదకు రావడం లేదు. నిర్మాత జెమిని కిరణ్ దగ్గర లాక్ అయ్యారు. నాగ్ చైతన్యతోనే సినిమా అనుకున్నారు. కానీ డేట్ లు సెట్ కావడం లేదు. నాగ్ చైతన్య ఆ స్క్రిప్ట్ తో ఎగ్జయిట్ అయ్యారు కానీ మల్టీస్టారర్ అంటే వెనక్కు అడుగేస్తున్నారు.
అంటే కాదు డైరక్టర్ పరుశురామ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు అన్న వార్తలు వచ్చాయి. ఇలాంటి టైమ్ లో చూసి, చూసి, ఇక బయటకు వచ్చేయాలా? అన్న ఊగిసలాట ప్రారంభించారు. ఇలాంటి నేపథ్యంలో హీరో శర్వానంద్ కు మహా సముద్రం స్క్రిప్ట్ వినిపించినట్లు బోగట్టా.
శర్వానంద్ ఫస్ట్ సిటింగ్ లో ఎగ్జయిట్ అయిపోయి, జూన్ నుంచి కంటిన్యూగా నాలుగునెలలు డేట్ లు ఇస్తానని చెప్పేసినట్లు, ఎవర్ని కో యాక్టర్ గా పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. మరి నిర్మాత ఎవరన్నది ఇంకా తెలియదు. మహా సముద్రం ప్రాజెక్టుకు ఎగ్జయిట్ అయిన రెండో హీరో శర్వా. మరి ఈసారి అయినా సెట్ మీదకు వెళ్తుందనే అనుకోవాలి. ఎందుకంటే శర్వాకు నిర్మాతల లైనప్ బాగానే వుంది.