శర్వానంద్ సినిమాకు భూకంపం ఎఫెక్ట్ తగులుతోంది. కథలో వున్నాక తప్పదు కదా? అందుకే అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ భూకంపం సెట్ వేస్తున్నారు. పైగా భూకంపం అంటే సెట్ వేస్తే సరిపోదు కదా? దానికి సిజి వర్క్ కూడా కావాలి. అందుకని ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఇదంతా డైరక్టర్ హను రాఘవపూడి సినిమా సంగతే. శర్వానంద్-సాయి పల్లవిలతో 'పడిపడి లేచె మనసు' అంటూ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాది అంతా కాస్త భారీ వ్యవహారమే. కలకత్తా షెడ్యూల్ నే 70 రోజులు చేసారు. ఇంకా మరో నలభై యాభై రోజులు వర్క్ వుంటుందని తెలుస్తోంది.
అందువల్ల ఈ భూకంపం వ్యవహారం ఒకటి. క్లయిమాక్స్ లో భూకంపం అనేది హైలట్ గా తెలుస్తోంది. అందుకనే భారీ సెట్, సిజి వర్క్ కు డిసైడ్ అయిపోయారు. ఇదిలా వుంటే ఇటీవల విడిుదలైన తేజ్ ఐ లవ్ యూ సినిమాకు ఈ సినిమాకు ఓ కామన్ పాయింట్ వుందని గతంలోనే గుసగుసలు వినిపించాయి. హీరోయిన్ తన ప్రేమను మరిచిపోవడం, హీరో గుర్తు చేయడం అన్నది ఆ కామన్ పాయింట్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది.
మరి ఈ భూకంపం క్లయిమాక్స్ ఏమిటన్నది మాత్రం తెలియాల్సి వుంది.