శర్వా.. కొత్త ఇల్లు.. కొత్త ఆఫీసు

హీరో శర్వానంద్ మంచి స్థితిపరుడు. తండ్రి వైపు నుంచి బాగానే స్థలాలు, ఇళ్లు, ఇంకా.. ఇంకా వున్నాయి. లేటెస్ట్ గా శర్వా జాబితాలో మరో ఇల్లు చేరింది. జూబ్లీహిల్స్ లో హీరో శర్వానంద్ మరో…

హీరో శర్వానంద్ మంచి స్థితిపరుడు. తండ్రి వైపు నుంచి బాగానే స్థలాలు, ఇళ్లు, ఇంకా.. ఇంకా వున్నాయి. లేటెస్ట్ గా శర్వా జాబితాలో మరో ఇల్లు చేరింది. జూబ్లీహిల్స్ లో హీరో శర్వానంద్ మరో మంచి ఇల్లు సమకూర్చుకున్నాడు. ఈ ఇంట్లో ఆదివారం గృహప్రవేశం చేయబోతున్నాడు.

అదే విధంగా ఓ కొత్త ఆఫీసు కూడా ఏర్పాటు చేసుకునే పనిలో శర్వా వున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫీసుకు పూర్తిగా కొత్తగా, వైవిధ్యంగా ఇంటీరియర్ చేయించే పనిలో వున్నాడు. ఈ మధ్య హీరోలు అందరికీ ఆఫీసుల సరదా పట్టింది. ఇప్పటికే బన్నీ మాంచి వైట్ అండ్ వైట్ థీమ్ తో ఓ ఆఫీసు రెడీ చేసుకున్నాడు.

నాని ఇంతకు ముందే వైవిధ్యమైన ఇంటీరియర్ తో ఆఫీసు ఏర్పాటు చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు దాదాపు ఏడెనిమిది నెలల కిందటే సరికొత్త ఆఫీసులోకి మారారు.

ఈ ఏడాది మాకు నచ్చిన బెస్ట్ సినిమా అదే 

ఇప్పటి వరకూ ఒక కథ, ఇక అసలు కథ! ఈవారం స్పెషల్ స్టోరీ