తమన్నా తెలుగులో ఎన్ని సినిమాలు చేసింది అంటే లెక్కపెట్టడం అంత సలువుగాదు. ఎందుకంటే చాలా సినిమాలే చేసింది కాబట్టి. హ్యాపీడేస్ నుంచి ఎఫ్ 2 దాకా బోలెడు సినిమాలు. అదే కనుక, తమన్నా తెలుగులో నటించగా హిట్ అయిన సినిమాలు ఎన్ని అంటే సులువుగా లెక్క పెట్టేయచ్చు. బాహుబలి లాంటి సినిమా కూడా ఫస్ట్ హాప్ లో తమన్నా వుంది. మిక్స్ డ్ టాక్ వచ్చింది. అదే సెకండాఫ్ అంతా అనుష్క వుంది. రావడమే హిట్ టాక్ వచ్చేసింది.
తమన్నా ట్రాక్ రికార్డు అలాంటిది. ఆ మధ్య కళ్యాణ్ రామ్ కు, ఈ మధ్య సందీప్ కిషన్ కు కూడా డిజాస్టర్లు ఇచ్చేసింది. అందుకే ఎప్పుడు అందరి కళ్లు ఎఫ్ 2 మీద వున్నాయి. ఈసారి దిల్ రాజుకు, విక్టరీ వెంకటేష్ కు తమన్నా ఏమివ్వబోతోంది? ఇప్పటిదాకా ఫ్లాపులు లేని డైరక్టర్ అనిల్ రావిపూడికి ఏమివ్వబోతోంది? అన్న డిస్కషన్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
పైగా పెద్ద సినిమాలతో పాటు ఎఫ్ 2 విడుదలవుతోంది. ఓ పక్క విపరీతమైన కాన్ఫిడెన్స్ వున్నా, నిర్మాత దిల్ రాజుకు మరోపక్క టెన్షన్ కూడా వుందని వినిపిస్తోంది. 2019ని తనకు హిట్ సినిమాతో స్టార్ట్ అయ్యేలా చూడమని డైరక్టర్ అనిల్ రావిపూడిని తరచు దిల్ రాజు కోరుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఏమైనా తమన్నా వుందన్న విషయం ఆలోచిస్తే, ఎఫ్ 2 విషయంలో కాస్త టెన్షన్ తప్పదు.