హీరో బాలకృష్ణకు విపరీతమైన నమ్మకాలు. ముహుర్తాలు.. ఇంకా.. ఇంకా. దాంతో ఎన్టీఆర్ బయోపిక్ సెన్సారు వాయిదా పడిపోయింది. నిన్నటికి నిన్న సెన్సారుకు అన్ని ఏర్పాట్లు చేసారు. ప్రసాద్ ల్యాబ్ లో సినిమా లోడ్ చేసి, వీక్షణకు రెడీచేసారు. కానీ సెన్సారు వాళ్లు చూస్తామన్న టైమ్ ఘడియలు బాగాలేవని, ఇప్పుడు వద్దని హీరో కమ్ నిర్మాత బాలకృష్ణ ఆపేసినట్లు బోగట్టా. దాంతో సెన్సారు వాళ్లు ఈనెల 31లోపు చూపించాలని, లేదా ఫ్రెష్ గా అప్లయ్ చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
కానీ జనవరి 3న అన్నివిధాలా బాగుందని, ఆరోజు చూడాలని కోరినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే ఎలాగూ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ ను బుక్ చేసాము కదా అని, ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో ఒకరైన సాయి కొర్రపాటి ఇటీవల తాను డిస్ట్రిబ్యూట్ చేసిన కేజీఎఫ్ సినిమాను బాలకృష్ణ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు.
బాలకృష్ణ సినిమా చూసి వెళ్లారు. బయోపిక్ సెన్సారు మాత్రం వెయిటింగ్ లో పడింది. అయితే బయోపిక్ రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ వుంది. 3న సెన్సారు జరిగినా అక్కడికి ఇంకా ఆరు రోజులు టైమ్ వుంటుంది.
సినిమా ఆడియన్స్‌ని హడలెత్తించిన డిజాస్టర్లు! స్పెషల్ 2018 ఈవారం పేపర్