సమ్మోహనం సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అదితిరావ్ హైదరి. ఆ తరువాత మళ్లీ సరైన పాత్ర, సినిమా దొరకలేదు. ఇప్పుడు ఆ కరువు తీరిపోయే చాన్స్ వచ్చింది. దర్శకుడు అజయ్ భూపతి డ్రీమ్ ప్రాజెక్టు మహాసముద్రంలో మెయిన్ హీరోయిన్ గా అదితిరావ్ కనిపించబోతోంది.
ఆర్ఎక్స్ 100 తరువాత మహాసముద్రం ప్రాజెక్టును ఎలా గైనా తెరకెక్కించాలని పట్టుదలగా వున్నారు అజయ్ భూపతి. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు వుండే ప్రాజెక్టు కావడంతో అంత సులవుగా సెట్ కాలేదు. ఆఖరికి ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ప్రాజెక్టు ఫిక్స్ అయింది.
శర్వానంద్ తో పాటు సిద్దార్ధ కూడా ఈ సినిమాలో మరో హీరో. అదితిరావ్ హైదరి ఓ హీరోయిన్. ఇంకో హీరోయిన్ ను వీలయినంత త్వరలో ఫిక్స్ చేసి, వీలైతే ఈ నెలలోనే అఫీషియల్ గా ప్రాజెక్టును ప్రకటిస్తారని బోగట్టా. ఒక చిన్న సినిమా తీసి, పెద్ద హిట్ కొట్టి, ఇన్నాళ్లు కేవలం ఓ ప్రాజెక్టును నమ్ముకుని వెయిట్ చేయడం అంటే, ఆ సబ్జెక్ట్ మీద ఎంత నమ్మకం వుండి వుండాలి. అలాంటి ప్రాజెక్టు అదితిరావ్ కు వచ్చింది అంటే మళ్లీ కచ్చితంగా జనాలు మెచ్చేపాత్ర అవుతుందని నమొచ్చు..