హీరో శర్వానంద్ కు రీజనబుల్ మార్కెట్ నే వుంది. అయితే అంత మాత్రం చేత మరీ భయంకరమైన రేట్ కోట్ చేసే పరిస్థితి అయితే అతనికి లేదు. కానీ ప్రస్తుతం శర్వా రేటు విషయంలో కొండ ఎక్కి కూర్చున్నట్లు తెలుస్తోంది. శర్వా ప్రస్తుతం రెండు కొత్త సినిమాలకు గీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ అగ్రిమెంట్ లు కావాలి. అందులో ఒకటి 14 రీల్స్ సినిమా. ఈ సినిమాకు శర్వా తన రెమ్యూనిరేషన్ కింద కోట్ చేసిన మొత్తం అచ్చంగా, అక్షరాలా ఎనిమిది కోట్లు అని తెలుస్తోంది. ఈ రేటు విని 14 రీల్స్ జనాలు గుభేల్ మన్నారని టాక్.
ప్రస్తుతం ఫినిష్ చేసిన సుధీర్ వర్మ సినిమాకు తీసుకున్నది నాలుగు కోట్లు. ఆ మధ్య డిజాస్టర్ అయి పడిపడి లేచె మనసుకు తీసుకున్నది ఆరుకోట్లు. మరి కొత్తగా ఈ ఎనిమిది కోట్లేమిటి? అన్నది పాయింట్. దానికీ కారణం వుంది.
తమిళ ప్రొడ్యూసర్ ఎస్ ఆర్ ప్రభు ఓ ద్విభాషా చిత్రాన్ని శర్వాతో చేయడానికి వచ్చారు. ఆయన ఏడో, ఎనిమిదో ఆపర్ చేసారని టాక్. అందుకని, ఇక శర్వా ఆ రేటుకే ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బేరాలు సాగుతున్నాయని వినికిడి. మరి ఎక్కడికి దిగుతాడో శర్వా చూడాలి.