సత్యమూర్తి కోసం ఇలియానా ఐటెమ్‌!

అయిదారేళ్ల పాటు టాలీవుడ్‌లో నంబర్‌వన్‌ హీరోయిన్‌గా రాజ్యమేలిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయి తెలుగు సినిమాలు సైన్‌ చేయడం మానేసింది. ఈమధ్య బాలీవుడ్‌లో తనకి అవకాశాలు తగ్గడంతో ఈ గోవా బ్యూటీ తిరిగి…

అయిదారేళ్ల పాటు టాలీవుడ్‌లో నంబర్‌వన్‌ హీరోయిన్‌గా రాజ్యమేలిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయి తెలుగు సినిమాలు సైన్‌ చేయడం మానేసింది. ఈమధ్య బాలీవుడ్‌లో తనకి అవకాశాలు తగ్గడంతో ఈ గోవా బ్యూటీ తిరిగి తెలుగు సినిమాలపై ఆసక్తి చూపిస్తోంది. తన మేనేజర్‌ చాలా కాలం నుంచీ ఇలియానా రీఎంట్రీకి రైట్‌ ప్రాజెక్ట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. 

ఫైనల్‌గా ఇలియానా రీఎంట్రీ ఒక ఐటెమ్‌ సాంగ్‌తో జరగనుందని తెలిసింది. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రంలో ఇలియానా ఐటెమ్‌ గాళ్‌గా తొలిసారి కనిపిస్తుందని సమాచారం. విశేషం ఏమిటంటే.. ఇదే దర్శకుడు, హీరోతో ఇలియానా తన లాస్ట్‌ తెలుగు ఫిలిం ‘జులాయి’ చేసింది. 

రీఎంట్రీకి ఇదే మంచి ఆఫర్‌ అని ఆమె భావించడానికి కారణం కూడా అదే అయి ఉండవచ్చు. ఇలియానాతో జల్సా, జులాయితో వరుసగా రెండు హిట్స్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌ సెంటిమెంట్‌గా ఆమెని రిపీట్‌ చేస్తున్నట్టున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లతో గ్లామర్‌కి ఏమాత్రం లోటు లేదు. ఇప్పుడు ఇలియానా ఎంట్రీతో ఈ సినిమా మరింత స్పైస్‌ అప్‌ అయింది.