సవ్యసాచి ప్రీరిలీజ్ బిజినెస్

మైత్రీ మూవీస్ సంస్థ చందు మొండేటి డైరక్షన్ లో నాగచైతన్య హీరోగా నిర్మించిన చిత్రం సవ్యసాచి. హీరో నాగచైతన్య కెరీర్ లోని భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటి అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే సినిమాకు దాదాపు…

మైత్రీ మూవీస్ సంస్థ చందు మొండేటి డైరక్షన్ లో నాగచైతన్య హీరోగా నిర్మించిన చిత్రం సవ్యసాచి. హీరో నాగచైతన్య కెరీర్ లోని భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటి అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే సినిమాకు దాదాపు 27 కోట్లు నికార్సుగా నిర్మాణం కోసం ఖర్చయింది. ఇక వడ్డీలు, పబ్లసిటీ అన్నీ కలుపుకుంటే, దాదాపు 33 కోట్ల వరకు వుంటుంది బడ్జెట్.

ఈ సినిమాకు లక్ ఏమిటంటే, సినిమా నిర్మాణం టైమ్ లోనే నాన్ థియేటర్ హక్కుల రూపంలో దాదాపు 12 కోట్ల వరకు రికవరీ రావడం. అమెజాన్ నుంచి నాలుగు కోట్ల వరకు, తెలుగు శాటిలైట్ ఓ నాలుగు కోట్ల వరకు, అలాగే హిందీ డబ్బింగ్, ఇతరత్రా నాలుగు కోట్ల వరకు వచ్చాయి. దాంతో అక్కడ సేఫ్ అయిపోయింది ప్రాజెక్టు. లేదూ అంటే చైతూ థియేటర్ మార్కెట్ ముఫై మూడు కోట్ల మేరకు లేదు కదా?

థియేటర్ హక్కులు మిగిలిన మొత్తాన్ని బ్యాలెన్స్ చేసాయి. కొన్నిచోట్ల రికవరబుల్ అడ్వాన్స్ గా, చాలా ఎన్ఆర్ఎ లుగా, రకరకాలుగా సినిమాను ఇచ్చేసారు. ఈ సినిమాకు, శైలజరెడ్డికి తేడా ఏమిటంటే, రెండింటికి మార్కెట్ ఒకలాగే డబ్బులు వచ్చాయి. కానీ అది గట్టిగా 20 నుంచి 22 కోట్లలో ఫినిష్ అయింది. ఇది మార్కెట్ మొత్తాన్ని బడ్జెట్ సరిపెట్టేసింది. నిర్మాతలకు లాభాలు ఓవర్ ఫ్లోస్ మీదే రావాలేమో?

నైజాం……………….5.00 కోట్లు
సీడెడ్……………….3.20
వైజాగ్.………………2.25
ఈస్ట్………………….1.44
వెస్ట్…………………..1.26
గుంటూరు……………1.70
కృష్ణ…………………..1.30
నెల్లూరు………………0.72
కర్ణాటక………………..1.70
ఓవర్ సీస్.……………3.00
తమిళనాడు..ఒరిస్సా,,ఆర్ఓఐ…0.37లక్షలు

జూనియర్ ఎన్ఠీఆర్ స్పెషల్ ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్ కోసం క్లిక్ చేయండి