దర్శకుడు త్రివిక్రమ్ అరుదుగా మీడియా ముందుకు వస్తుంటారు. అజ్ఞాతవాసి డిజాస్టర్ తరువాత అస్సలు మీడియాకు దూరంగా వుండిపోయిన త్రివిక్రమ్, అరవింద హిట్ తో కాస్త ఎక్కువగానే ఇంటరాక్ట్ అవుతున్నారు. ఓ యూట్యూబ్ చానెల్ కు కాస్త సుదీర్ఘమైన ఇంటర్వూ ఇచ్చారు. ఈ ఇంటర్వూలో మిగిలిన సంగతులు అన్నీ అలావుంచితే, ఒక పాయింట్ కు సమాధానంగా చెప్పిన సమాధానాలే అనుమానంగా వున్నాయి. నిజమే చెప్పారా? అబద్దం చెప్పారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
మీకు దేవుడి మీద నమ్మకం వుందా? అన్న ప్రశ్నకు త్రివిక్రమ్..'నేను గుళ్లకు వెళ్లను, పూజలు చేయను. ముహుర్తాలు అవీ నమ్మను. అయితే దేవుడు వున్నాడని మాత్రం నమ్మతాను' అంటూ సమాధానం ఇచ్చారు. కానీ త్రివిక్రమ్ తో పరిచయం వున్నవారు చెప్పే సంగతులు దీనికి పూర్తిగా భిన్నంగా వుంటాయి.
నిజానికి పూజలు, సంధ్యావందనాలు చేయడం తప్పుకాదు. ఎవరి నమ్మకాలు వారికి వుంటాయి. కానీ అవి వుండీ లేవని చెప్పడం ఏమిటా? అని. త్రివిక్రమ్ సంధ్యావందనం చేస్తారని, ఆయనే పవన్ కళ్యాణ్ కు జంధ్యం ప్రాశస్త్యం చెప్పి, ధరించేలా చేసారని టాక్ వుంది.
త్రివిక్రమ్ కు ఓ గురువుగారు వున్నారు. అదివాస్తవం. ఆయనతో హోమాలు గట్రా చేయిస్తుంటారని, అవి కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి అని ఇండస్ట్రీలో వినిపిస్తూ వుంటుంది. పైగా త్రివిక్రమ్ ద్వారా ఆ గురువు అటు హారిక హాసిని, పవన్, ఎన్టీఆర్, మహేష్ లకు కూడా పరిచయం అయ్యారని అంటారు.
పైగా ఆ మధ్య స్వంత ఇల్లు కట్టుకున్నపుడు సశాస్త్రీయంగా, అన్ని విధులు నిర్వహించే గృహప్రవేశం కూడా చేసారు. ఇక ముహుర్తాల గురించి చెప్పనక్కరే లేదు. త్రివిక్రమ్ సినిమాలు కావచ్చు, హారిక సినిమాలు కావచ్చు. ప్రతి స్టెప్ లోనూ ముహుర్తాలు వుంటాయని ఇండస్ట్రీలో టాక్ వుంది. దాని వెనుక త్రివిక్రమ్ వున్నారంటారు.
మరి అసలు పూజలే చేయనని, ముహుర్తాలు నమ్మనని త్రివిక్రమ్ చెప్పడం కాస్త ఆశ్చర్యంగా వుంది.
జూనియర్ ఎన్ఠీఆర్ స్పెషల్ ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్ కోసం క్లిక్ చేయండి