Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్క్రీన్ పైకి మళ్లీ సిమ్రాన్

స్క్రీన్ పైకి మళ్లీ సిమ్రాన్

తెలుగు, తమళ సినిమాల్లో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ సిమ్రాన్. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, నటన, కామెడీ పండించడంలో సిమ్రాన్ కు మాంచి స్టయిల్ వుంది. హీరోయిన్ గా చాలా సినిమాలు చేసేసాక పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. 2009 తరువాత ఒకటి రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరియన్స్ నే తప్ప, ఫుల్ లెంగ్త్ రోల్స్ ఒప్పుకోలేదు.

అయితే ఇప్పుడు ఓ తమిళ సినిమాలో మాంచి రోల్ కు సిమ్రాన్ సైన్ చేసిందట. సెల్వారాఘవన్ దర్శకత్వంలో అరవింద్ స్వామి, రితిక సింగ్ నటించే సినిమాలో పోలీస్ ఇన్ స్పెక్టర్ క్యారెక్టర్ పోషించేందకు సిమ్రాన్ ఓకె చెప్పిందట.

ఇన్నాళ్లు సరైన క్యారెక్టర్ దొరకకే ఎవ్వరు అడిగానా ఓకె చెప్పలేదని, ఇప్పుడు సెల్వా చెప్పిన కథ, అందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నచ్చడంతో ఓకే చేసానని అంటోంది సిమ్రాన్. ఈ లెక్కన మన జనాలు కూడా మంచి పాత్రలు వుంటే సిమ్రాన్ దృష్టికి తీసుకెళ్లొచ్చు. మన జనాలకు సిమ్రాన్ అంటే బాగా గుర్తే కదా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?