మహర్షిలో సీక్రెట్ సాంగ్.. రిలీజ్ వరకు సస్పెన్స్

మహర్షి సినిమాకు సంబంధించి 6 పాటలతో జ్యూక్ బాక్స్ రిలీజ్ చేశారు. వీటిలో కేవలం 2 మాత్రమే స్ట్రయిట్ సాంగ్స్. అందులో ఒకటి డ్యూయట్. మిగతావన్నీ మాంటేజ్ సాంగ్స్. ఈ విషయాన్ని దర్శకుడు వంశీ…

మహర్షి సినిమాకు సంబంధించి 6 పాటలతో జ్యూక్ బాక్స్ రిలీజ్ చేశారు. వీటిలో కేవలం 2 మాత్రమే స్ట్రయిట్ సాంగ్స్. అందులో ఒకటి డ్యూయట్. మిగతావన్నీ మాంటేజ్ సాంగ్స్. ఈ విషయాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి బయటపెట్టాడు. అయితే మహర్షిలో మరో సర్ ప్రైజ్ సాంగ్ కూడా ఉంది. అది జూక్ బాక్స్ లో లేదు. అంటే సినిమాలో మొత్తం 7 పాటలన్నమాట.

సీక్రెట్ గా ఉంచిన ఆ పాట కూడా డ్యూయట్ కాదు. అది కూడా మాంటేజ్ సాంగ్. అది కేవలం సినిమాలో చూసి ఎంజాయ్ చేయాలంటున్నాడు వంశీ పైడిపల్లి. ఆ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయని, జ్యూక్ బాక్స్ ఒకెత్తయితే.. ఆ ఒక్క మాంటేజ్ సాంగ్ మరోఎత్తు అంటున్నాడు.

దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మహేష్ కెరీర్ లో 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ 9వ తేదీన రిలీజ్ అవుతోంది. తాజాగా ముగ్గురు నిర్మాతల మధ్య ఏర్పడిన డబ్బుల లెక్కల పంచాయతీ కూడా ముగిసింది. 

మరీ దెబ్బతినని మోడీ ఇమేజ్… కోలుకున్నా పుంజుకోని కాంగ్రెస్!