శీనయ్య సమస్య అదేనా?

దర్శకుడు వివి వినాయక్ కీలకపాత్రలో దిల్ రాజు నిర్మించే సినిమా శీనయ్య. ఈ సినిమా ఎంతకూ సెట్ మీదకు వెళ్లడం లేదు. ఇదిగో అదిగో అనే వినిపిస్తోంది. దీంతో అసలు ఆ ప్రాజెక్టు వుంటుందా?ఊడుతుందా?…

దర్శకుడు వివి వినాయక్ కీలకపాత్రలో దిల్ రాజు నిర్మించే సినిమా శీనయ్య. ఈ సినిమా ఎంతకూ సెట్ మీదకు వెళ్లడం లేదు. ఇదిగో అదిగో అనే వినిపిస్తోంది. దీంతో అసలు ఆ ప్రాజెక్టు వుంటుందా?ఊడుతుందా? అన్న డిస్కషన్లు వినిపించడం ప్రారంభమైంది.  కానీ అసలు విషయం వేరు అని తెలుస్తోంది.

శీనయ్య లైన్ ను పట్టుకుని, కథ ను పూర్తి సినిమాటిక్ స్క్రిప్ట్ గా మార్చేటప్పుడు ఎలాగూ తను కూడా దర్శకుడు అని వివి వినాయక్ ను కూడా ఇన్వాల్వ్ చేసినట్లు బోగట్టా. అలా ఆ స్క్రిప్ట్ పూర్తిగా ఆయన తన స్టయిల్ కు, తన ఆలోచనలకు అనుగుణంగా తయారుచేసినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఆ స్క్రిప్ట్ దిల్ రాజుకు అంతగా నచ్చలేదు. దాంతో మళ్లీ తన ఆస్థానంలో అదే స్క్రిప్ట్ ను మళ్లీ తయారుచేయించడం ప్రారంభించారు. తొలిసగం పూర్తయింది. మలిసగం స్క్రిప్ట్ పూర్తి కావాలి. అది పూర్తయితే అప్పుడు శీనయ్య సినిమా సెట్ మీదకు వెళ్తుందని తెలుస్తోంది.

ఏ జోనర్ చేసినా ఫ్లాపులు పలకరించాయి