నీలకంఠ-మధురాశ్రీధర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మాయ. అతీత శక్తుల నేపథ్యంలో తయారైన థ్రిల్లర్ ఇది. ఈ సినిమా కాన్సెప్ట్ రివీల్ అనేపేరిట ట్రయిలర్ ను ఈరోజు విడుదల చేసారు. అంతా బాగానే వుంది. అయితే ట్రయిలర్ లో వినిపించిన ఓ ట్యూన్ అచ్చమైన కాపీ ట్యూన్ కావడం విశేషం. ఆ ట్యూన్ సినిమాలో వచ్చే ఓ పాటలోంచి కట్ చేసి, ట్రయిలర్ లోవుంచారు.
ఇంతకీ అది ఎక్కడ నుంచి కొట్టుకు వచ్చారంటే, జి వి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన మదరాసుపట్టణం సినిమాలోని 'పూలు పూయు తరుణం' పాటలోంచి. ఆ విషయమే శేఖర్ చంద్రను అక్కడే ప్రశ్నిస్తే, మందు నో అన్నారు. తరువాత ఒరిజినల్ ట్యూన్ వినిపిస్తే, కాస్సేపు నివ్వెరపోయి, ఆపై సేమ టు సేమ్ వుందని అంగీకరించారు.
అయితే తాను ఎప్పుడో ఎక్కడో విని వుంటానని, బుర్రలో రిజిస్టర్ కావడం వల్ల అలా జరగే అవకాశం వుందని, సినిమా కాన్సెప్ట్ లాగే సైంటిఫిక్ రీజన్ తీయడానికి ప్రయత్నించారు. మొత్తానికి అంతా మాయ..కాపీ మాయ అన్న మాట.