Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శేఖర్ కమ్ముల అవార్డును హైజాక్ చేశారంట!

శేఖర్ కమ్ముల అవార్డును హైజాక్ చేశారంట!

నంది అవార్డులకు సంబంధించిన వివాదాలు రావణ కాష్టం లా రగులుతూనే ఉన్నాయి. నెమ్మదిగా ఈ నందుల గొడవకే సంబంధించి.. మరిన్ని కొత్త సంగతులూ బయటకు వస్తున్నాయి. జ్యూరీ సభ్యులందరి అభిప్రాయాలతో జరిగిన ఎంపికలో.. నిగ్గుతేలిన పేర్లను... చివరి నిమిషంలో బలవంతంగా మార్పించారని ఒక పుకారు వినిపిస్తోంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సినీ దర్శకుల లైఫ్ టైం అఛీవ్ మెంట్ అనదగినట్లుగా.. వారికి బిఎన్ రెడ్డి పురస్కారాన్ని ప్రకటిస్తూంటుంది.

అలాగే ఈ దఫా కూడా.. ఒకేసారి మూడు సంవత్సరాలకు నందులను ఎంపిక చేశారు గనుక.. బిఎన్ రెడ్డి అవార్డుకు కూడా ముగ్గురిని ఎంపిక చేశారు. రాజమౌళి, బోయపాటి శ్రీను , త్రివిక్రమ్ శ్రీనివాస్ లకు ఆ అవార్డులు దక్కాయి. అయితే వాస్తవానికి జ్యూరీ వారంతా కలిసి శేఖర్ కమ్ములను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేశారుట. అయితే.. పై ముగ్గురిలో ఒకరు.. చివరి నిమిషంలో శేఖర్ కమ్ముల దక్కవలసిన పురస్కారాన్ని హైజాక్ చేసేశారని సమాచారం.

వివరాల్లోకి వెళితే...  బిఎన్ రెడ్డి పురస్కారం అంటేనే విలువలున్న చక్కటి కుటుంబకథా చిత్రాలకు పేరుమోసిన దర్శకులకు ఇస్తే సబబుగా ఉంటుందని ఎవరికైనా అనిపిస్తుంది. బిఎన్ రెడ్డి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే సినిమాలన్నీ అలాంటివే. ఇలాంటి  నేపథ్యంలో.. సమకాలీన దర్శకుల్లో ఇలాంటి వారెవరంటే ఖచ్చితంగా చాలా మందికి శేఖర్ కమ్ముల పేరు గుర్తుకు వస్తుంది. కుటుంబం మొత్తం కలిసి సినిమా చూడాలనే లక్ష్యంతో తీసేలా కనిపించే కొద్ది మంది దర్శకుల్లో శేఖర్ కూడా ఒకరు. జ్యూరీ సభ్యులు ఒక ఏడాది పురస్కారం కింద ఆయన పేరును ఎంపిక చేశారు.

అయితే చివరి నిమిషంలో.. ఈ వ్యవహారంలో  అల్లు అరవింద్ జోక్యం చేసుకున్నట్లుగా ఒక పుకారు వినిపిస్తోంది. రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి స్టార్ దర్శకుల తోపాటు శేఖర్ కమ్ముల లాంటి సాఫ్ట్ దర్శకుడు అక్కర్లేదని, వారి సరసన బోయపాటి శ్రీను ఉంటే గ్రాండ్ గా ఒకటే జోనర్ దర్శకుల్లాగా ఉంటుందని జ్యూరీ వారందరికీ బ్రెయిన్ వాష్ చేసి ఒప్పించినట్లుగా సమాచారం. శేఖర్ కమ్ములకు కావలిస్తే.. మరోసారి మరో జోనర్ దేనిలో అయినా అవార్డు ఇచ్చుకోవచ్చునని.. ప్రస్తుతం.. ఒకేటే స్కేల్ లో రిచ్ గా ఉండాలంటే.. రాజమౌళి, త్రివిక్రమ్ తోపాటూ బోయపాటి శ్రీను పేరు చేరుద్దాం అని ఒత్తిడి చేశారుట.

చేసేది లేక జ్యూరీ వారు ఓకే చెప్పేశారు. ఆ రకంగా బోయపాటి శ్రీను పేరు తొలిజాబితాలో లేకపోయినా.. ఆయనకు బిఎన్ రెడ్డి అవార్డు దక్కింది. శేఖర్ కమ్ముల కు ఈ అవార్డుకు పూర్తిస్థాయిలో అర్హత ఉన్నప్పటికీ.. ఆయన లిస్టునుంచి జారిపోవాల్సి వచ్చింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?