లీడర్ సినిమాతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అందించారు డైరక్టర్ శేఖర్ కమ్ముల. అంతకు ముందు ఆ తరువాత కూడా మాంచి ప్రేమ, భావోద్వేగ అంశాలే ముడిసరుకులు అయ్యాయి.
ఓసారి థ్రిల్లర్ ను ట్రయ్ చేసారు కానీ సెట్ కాలేదు. అంటే జనాలు శేఖర్ కమ్ముల అంటే ప్రేమ, మానవ సంబంధాలు, భావోద్వేగాలు అనే ఫిక్స్ అయిపోయారన్నమాట.
అయితే లవ్ స్టోరీ తరువాత శేఖర్ కమ్ముల తమిళ హీరోతో ధనుష్ తో చేయబోయే సినిమాకు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ను తీసుకోవాలని అనుకుంటున్నాడట.
నిజానికి లీడర్ సినిమా ఇప్పటికీ చాలా మంది శేఖర్ కమ్ముల అభిమానులకు నచ్చే సినిమానే. కానీ ఎక్కడో మిస్ ఫైర్ అయింది.
కానీ ఈసారి మాత్రం శేఖర్ కమ్ముల పక్కా మంచి పొలిటికల్ కంటెంట్ తో ముందుకు వస్తే ఆదరించడానికి ఆయన అభిమానులు సిద్దంగా వుంటారు. ఈ సినిమాకు ఆసియన్ సునీల్ నారంగ్ నిర్మాత.