డబ్బున్న బాబులు ఆస్తులు కొనడం, అమ్మడం పెద్ద చిత్రమేం కాదు. కానీ సెలబ్రిటీలు ఏం చేసినా వార్తే కాబట్టి ఆ లెక్కన ఇదీ వార్తే. సీనియర్ హీరో ఒకరు తనకు వున్న మాంచి విలువైన ప్రాపర్టీ ఒకదాన్ని అమ్మే ప్రయత్నం ఆరంభించినట్లు తెలుస్తోంది.
ఫిలిం నగర్ సమీపంలో వున్న ఈ విలువైన ప్రాపర్టీని అమ్మేసి, వున్న చిన్నా, చితక అప్పులు తీర్చేసి, మిగిలిన మొత్తం మళ్లీ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో వున్నట్లు బోగట్టా.
నిజానిక ఈ ప్రాపర్టీ మీద నెల నెల మంచి ఆదాయమే వస్తుంది. కానీ అప్పులు కొన్ని బాధిస్తుండడం, ఖర్చులే తప్ప, సినిమాల ఆదాయం లేకపోవడం వంటి కారణాలతో ఈ ప్రాపర్టీని అమ్మేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా అమ్మితే 200 కోట్ల వరకు వస్తుందని, మళ్లీ కీలకమైన చోట కమర్షియల్ స్పేస్ మీద పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారట.
బేరం తెగితే అతి త్వరలోనే సేల్ వ్యవహారం పూర్తవుతుంది విశ్వసనీయ వర్గాల బోగట్టా. ప్రస్తుతం ఈ హీరో స్వంత సినిమాలే రెండు ప్లాన్ చేస్తున్నారు.