సెప్టెంబర్ 20న ఆ సినిమా ట్రయిలర్

అక్కినేని నాగార్జున ఈ ఏడాదిలో అందిస్తున్న రెండో సినిమా రాజుగారి గది 2. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లోగో లుక్ నిన్న విడుదల చేసారు. అయితే…

అక్కినేని నాగార్జున ఈ ఏడాదిలో అందిస్తున్న రెండో సినిమా రాజుగారి గది 2. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లోగో లుక్ నిన్న విడుదల చేసారు. అయితే వచ్చేవారం వస్తున్న నాగ్ బర్త్ డేకు డిజిటల్ మోషన్ పోస్టర్ రెడీ చేస్తున్నారు. 

అక్కినేని నాగేశ్వరరావు జయంతి అయిన సెప్టెంబర్ 20న ట్రయిలర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే అదే నెల 30న 'రాజుగారి సభ' అనే రేంజ్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని ప్లాన్ చేస్తున్నారు. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత ఓ కీలకపాత్రలో నటించడం విశేషం. 

రాజుగారి గది సినిమాకు వచ్చిన సక్సెస్ ను తోడుగా చేసుకుని, డిఫరెంట్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను రెడీ చేస్తున్నారు. పెద్ద స్టార్ తో సినిమా చేయడం ఓంకార్ కు ఇదే ప్రథమం. ఈ సినిమా సక్సెస్ మీద అతని సినిమా డైరక్షన్ కెరీర్ ఆధారపడి వుంటుంది.