ఏ సినిమాకు ఎలా వుంది?

కనిపించడం లేదు కానీ, ఈ వారం కూడా థియేటర్ల వద్ద బోలెడు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే థియేటర్ల లో వున్న ఫిదా, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకీ నాయక తమ…

కనిపించడం లేదు కానీ, ఈ వారం కూడా థియేటర్ల వద్ద బోలెడు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే థియేటర్ల లో వున్న ఫిదా, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకీ నాయక తమ ఉనికి చాటుతూనే వున్నాయి. గతవారం విడుదలైన ఆనందో బ్రహ్మ స్టడీగానే వుంది. ఇప్పుడు విఐపి 2, వివేకం, అర్జున్ రెడ్డి సినిమాలు వచ్చాయి. అంటే వినాయకచవితి, ప్లస్ వీకెండ్ కు ఏడు సినిమాలు అర్బన్ ఏరియాలో కలెక్షన్లు షేర్ చేసుకోవాలన్నమాట. 

అయితే హైదరాబాద్ లో లేదా అర్జున్ రెడ్డి షో వున్న ఏరియాల్లో ఆ సినిమానే ఫస్ట్ చాయిస్ గా కనిపించింది వినాయకచవితి నాడు. ప్రతి షో పుల్స్ కనిపించాయి. ఆ తరువాత చాయిస్ ఆనందో బ్రహ్మ తీసుకుంది. హైదరాబాద్ లో ఫిదా ఆ తరువాతి స్థానాన్ని తీసుకుంది కానీ, ఆంధ్ర ఏరియాలో మాత్రం జయ జానకీ నాయక ఆ ప్లేస్ లోకి వచ్చింది. 

విఐపి 2, వివేకం ఈ వారమే విడుదలయినా కూడా, గత వారాల్లో విడుదలైన సినిమాల కలెక్షన్లకు కాస్త అటుగా మాత్రమే వుండడం విశేషం. కృష్ణ జిల్లాలో జయ జానకీ నాయక అయిదు లక్షల యాభై వేల వరకు నిన్న షేర్ తెచ్చుకుంటే, వివేకం ఏడు లక్షలు, విఐపి 2 ఎనిమిది లక్షలు షేర్  తెచ్చుకున్నాయి. ఆనందో బ్రహ్మ నాలుగు లక్షల రేంజ్ లో కలెక్షన్లు సాధించింది. అర్జున్ రెడ్డి రెండో రోజు కృష్ణ జిల్లాలో 21 లక్షలు షేర్ తెచ్చుకోవడం విశేషం. వివేకం కన్నా విఐపి 2కి మంచి ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి. శని, ఆది వారాలు కూడా సినిమాలన్నీ బాగానే షేర్ లాగే అవకాశాలు వున్నాయి.