సెప్టెంబర్ లో బన్నీ-సుకుమార్

అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బన్నీ తన తరువాత సినిమా కోసం రెడీ అయిపోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం బన్నీ గెడ్డం పెంచుతున్నాడు. అదే సమయంలో చిత్తూరు స్లాంట్ ను…

అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బన్నీ తన తరువాత సినిమా కోసం రెడీ అయిపోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం బన్నీ గెడ్డం పెంచుతున్నాడు. అదే సమయంలో చిత్తూరు స్లాంట్ ను ప్రాక్టీస్ చేస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ కేరళ లోని టెన్ కాశీ లో వుండి లోకేషన్ల అన్నీ ఫిక్స్ చేసుకుంటున్నారు. 

ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని నిర్మాతలకు మైత్రీ మూవీ మేకర్స్ పట్టుదలగా వున్నారు. అయితే రాజమౌళి ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 2న విడుదలకు రెడీ అవుతోంది. అందువల్ల ఓ నెల ముందుగా సెప్టెంబర్ లోనే బన్నీ-సుకుమార్ ను తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నారు. 

ఈ టైమ్ లోగా ఎలాగైనా సినిమాను ఫినిష్ చేయాలన్నది సినిమా నిర్మాతలైన మైత్రీ మూవీస్ ఆలోచనగా వుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

నాన్ను ఒక్క డైరెక్టర్ చిన్న హీరో అన్నారు

వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి