రెండు, మూడేళ్ల క్రితం వరకు శేష్ కేవలం రెండు కోట్ల లోపు సినిమాలకి మాత్రమే పరిమితమైన హీరో. తన సక్సెస్‌ని తానే లిఖించుకుని లిటరల్‌గా తన రాత తానే మార్చుకున్నాడు. మొదట్లో హీరోగా చేసిన చిత్రాలు ఫెయిలవడంతో ఇతరుల చిత్రాల్లో చిన్నా చితకా పాత్రలు పోషించాడు. ఆ తర్వాత క్షణంతో తొలిసారిగా తన ఉనికి చాటుకున్నాడు.
గూఢచారి చిత్రానికి తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీ ప్రోడక్ట్ అందించి అందరినీ సర్‌ప్రైజ్ చేసాడు. గూఢచారి ఘన విజయాన్ని అందుకున్న తర్వాత శేష్‌పై, అతని ఎంపికపై నమ్మకం పెరిగింది. ఎవరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ఈ చిత్రం కూడా విజయవంతం కావడంతో శేష్ ఇప్పుడు పది కోట్ల బడ్జెట్ వున్న చిత్రాలకి కల్పతరువులా కనిపిస్తున్నాడు.
శేష్ రైజ్‌తో పలువురు హీరోలు డిఫెన్స్‌లో పడ్డారు. తమకి రావాల్సిన అవకాశాలు అటు వెళుతున్నాయనే అక్కసుతో పాటు మహేష్‌బాబు నిర్మాణంలో 'మేజర్' చేస్తుండడంతో మరింతగా అతను పైకి వస్తున్నాడని శేష్ సక్సెస్‌ని చాలా మంది ఓర్వలేకపోతున్నారు. అయితే సక్సెస్‌ని క్యాష్ చేసుకునే ఆత్రం లేకుండా జాగ్రత్తగా కథలు ఎంచుకుంటూ నెమ్మదిగానే నిచ్చెన ఎక్కుతున్నాడు.