Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సెట్స్ పైకి సవ్యసాచి

సెట్స్ పైకి సవ్యసాచి

మొత్తానికి మళ్లీ సవ్యసాచి సెట్ మీదకు వస్తున్నాడు. ఈనెల 24 నుంచి కంటిన్యూగా 15 రోజుల పాటు షూటింగ్ వుంటుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. ఈ సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ వేరే షూటింగ్ లో వుండడం వల్ల ఆగస్టు ఫస్ట్ వీక్ లో షూటింగ్ లో జాయిన్ అవుతుంది. ఈలోగా హీరో, మాధవన్, భూమిక సీన్లు తీస్తారు.

సవ్యసాచి రకరకాల కారణాలతో విడుదల వాయిదాపడుతూ వస్తోంది. ఆఖరికి ఆగస్టు 3 అనుకున్నారు. సెకెండ్ వీక్ అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఆగస్టు 31కి కానీ  వచ్చేలాలేదు. ఎందుకంటే సినిమా షూటింగ్ నే ఆగస్టు10 వరకు వుంటుంది. ఆపైన ఆర్.ఆర్ ఇతర వ్యవహారాలు వుండనే వున్నాయి. అందువల్ల ఆగస్టు 31 మాత్రమే లాస్ట్ చాన్స్.

కానీ ఈ డేట్ ను శైలజారెడ్డి అల్లుడు నిర్మాతలు ఎపుడో రిజర్వ్ చేసుకున్నారు. వాళ్లు ససేమిరా అంటున్నారు. అందువల్ల సవ్యసాచి విడుదల మరి ఇప్పట్లో వుండదనే అనుకోవాలి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లు కూడా ఖాళీ లేవు. హీరో చైతన్య, తలుచుకుని, గట్టిగా పట్టుకుని, శైలజారెడ్డిని బలవంతగా వెనక్కు పంపితే తప్ప, సవ్యసాచి సినిమా మరో మూడునెలల దాకా విడదుల కాకపోవచ్చు. చూడాలి ఏం జరుగుతుందో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?