సాక్ష్యం సినిమా ఈ శుక్రవారం విడుదలకు రెడీగావుంది కానీ సెన్సారు పూర్తికావాలి. దానికి మించి ఆనిమల్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రావాలి. సినిమాలో జంతువుల్ని వాడినా, సిజి వర్క్ చేసినా ఈ బోర్డు పరిశీలించి, ఓకె అంటూ సర్టిఫికెట్ ఇస్తేనే, సెన్సారు సర్టిఫికెట్ లభిస్తుంది.
సాక్ష్యం సినిమాలో పంచభూతాల కాన్సెప్ట్ వుంది. సినిమా ఆరంభంలోనూ, చివర్న ఓ ఎద్దు (నందీశ్వరుడి అవతారం) కీలకపాత్ర వుంది. ఇక్కడే ఆనిమల్ బోర్డు సర్టిఫికెట్ కష్టం అయింది. దాంతో ఈ గురువారం మళ్లీ సమావేశం వుంది. ఆ రోజు సర్టిఫికెట్ రావాలి. ఈలోగా మంగళవారం నాడు సాక్ష్యం సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసి రెడీగా వుంటారు. గురువారం ఆ సర్టిఫికెట్ రావడంతోనే ఈ సర్టిఫికెట్ ఇస్తారు. ఒకవేళ లాస్ట్ మినిట్ టైమ్ సరిపోకపోతే, శుక్రవారం బదులు శనివారం విడుదల చేసే అవకాశం కూడా పరిశీలనలో వుంది.
సుమారు నలభై కోట్లకు పైగా వ్యయంతొ తయారైన సాక్ష్యం సినిమాను అభిషేక్ నామా నిర్మించారు. ఈ సినిమాను టోటల్ గా యూరోస్ సంస్థ టేకోవర్ చేసింది.