మూడు నెలల దాకా సినిమా లేనట్లే

హీరో రాజ్ తరుణ్ పాపం బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో సతమతమవుతున్నాడు. సరైన గైడన్స్ లేకపోవడం కావచ్చు, రాంగ్ గైడెన్స్ కావచ్చు, సరైన సినిమాలు, బ్యానర్లు ఎంచుకోలేకపోయాడు. పెద్ద బ్యానర్లకు దూరం అయ్యాడు. దాంతో…

హీరో రాజ్ తరుణ్ పాపం బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో సతమతమవుతున్నాడు. సరైన గైడన్స్ లేకపోవడం కావచ్చు, రాంగ్ గైడెన్స్ కావచ్చు, సరైన సినిమాలు, బ్యానర్లు ఎంచుకోలేకపోయాడు. పెద్ద బ్యానర్లకు దూరం అయ్యాడు. దాంతో డిజాస్టర్లు పలకరించినపుడు ఆదుకునేవారు కరువయ్యారు.

ఇప్పుడు చేతిలో సినిమా లేదు. తిరుపతి వెంకన్నే దిక్కు అని మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నట్లు బోగట్టా. తిరుపతి వెళ్లి తలనీలాలు ఇచ్చి వస్తాడని తెలుస్తోంది. అంటే మళ్లీ పూర్తిగా జుట్టు రావాలంటే కనీసం మూడునెలలు పడుతుంది. సో, మూడునెలల పాటు సినిమాలు లేనట్లే అనుకోవాలి. గతంలో కుమారి 21 ఎఫ్ సినిమా అందించిన ప్రతాప్ డైరక్షన్ లో ఓ సినిమా అనుకున్నారు. కానీ అది అలా పెండింగ్ లో వుంది. అలాగే కొత్త డైరక్టర్ తో టాగోర్ మధు నిర్మాతగా సినిమా వుంది. అది కూడా పెండింగ్ లో పడిపోయినట్లు వినికిడి.

మొత్తంమీద మూడునెలల తరువాత సినిమా ఆలోచన వుంటే, మరో మూడునెలల తరువాత కానీ తెరమీదకు  రావడం కష్టం. ఈసారి అయినా సరైన బ్యానర్ ను ఎంచుకుంటే మంచిది.