‘షకీలా’ సినిమాలో ఏమేముంటాయ్‌.?

మొన్నీమధ్యనే బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ బయోపిక్‌ 'సంజూ' వచ్చింది. అందులో, సంజయ్‌దత్‌ లైఫ్‌ని పాజిటివ్‌ యాంగిల్‌లోనే చూపించారు. చాలావరకు బయోపిక్స్‌ అలానే వుంటాయి. చాలా అరుదుగా మాత్రమే, బయోపిక్‌లో నెగెటివ్‌ యాంగిల్‌ కన్పిస్తుంటుంది. మరి,…

మొన్నీమధ్యనే బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ బయోపిక్‌ 'సంజూ' వచ్చింది. అందులో, సంజయ్‌దత్‌ లైఫ్‌ని పాజిటివ్‌ యాంగిల్‌లోనే చూపించారు. చాలావరకు బయోపిక్స్‌ అలానే వుంటాయి. చాలా అరుదుగా మాత్రమే, బయోపిక్‌లో నెగెటివ్‌ యాంగిల్‌ కన్పిస్తుంటుంది. మరి, మలయాళ నటి షకీలా సంగతేంటి.? ఆమె బయోపిక్‌ ఎలా వుండబోతోంది.? ఈ ప్రశ్నకు ఆమె మాటల్లోనే చెప్పాలంటే, 'నిజం'లా వుంటుందట. 
'నా జీవితం పూర్తిగా ఈ సినిమాలో ఆవిష్కృతం కాబోతోంది.

ఇందులో నా గురించి మంచీ, చెడూ.. రెండూ వుంటాయి. ఏదన్నా అంశాన్ని దాచేస్తే, అసలు బయోపిక్‌ అన్న మాటకే అర్థం లేదు' అని షకీలా చెబుతోంటే, 'షకీలాలో ఈ సిన్సియారిటీనే నాకు నచ్చింది. అందుకే ఈ బయోపిక్‌ చేయాలనుకుంటున్నా' అని బాలీవుడ్‌ బ్యూటీ రిచా చద్దా చెబుతుండడం గమనార్హం. షకీలా అంటే, ఇప్పుడు చాలా తక్కుమందికే తెలియవచ్చుగాక. కానీ, ఒకప్పుడు ఆమె మలయాళ సినీ పరిశ్రమని ఓ ఊపు ఊపేసింది. అక్కడ సి-గ్రేడ్‌ సెక్స్‌ మూవీస్‌ స్పెషలిస్ట్‌గా షకీలా పేరొందింది.

షకీలా సినిమా అంటే బూతు మాత్రమే. ఇందులో ఇంకో మాటకు తావులేదు. కథ, కాకరకాయ అవసరం లేదు. కేవలం షకీలాతోపాటు ఆ సినిమాలో పరిమిత సంఖ్యలో మాత్రమే నటీనటులు వుండేవారు. మొత్తంగా సినిమా షకీలా చుట్టూనే తిరుగుతుంది. సినిమా నిండా 'సెక్స్‌ సీన్స్‌' కన్పించేవి. ఇండియాలో పోర్న్‌కి అవకాశంలేదు. కానీ, ఆ స్థాయిలోనే షకీలా సినిమాలుండేవి. అయితే, థియేటర్లలో సెన్సార్‌ చేసేసిన సినిమాలే ప్రదర్శితమయ్యేవి. కొన్ని షోలలో మాత్రం సెన్సార్‌ లేకుండా సీన్స్‌ దర్శనమిచ్చేవి. అలా, షకీలా సినిమాలంటే ఓ వర్గం ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ వుండేది.

మరి, ఆ సీన్స్‌ని షకీలా ఎలా 'బయోపిక్‌'లో జస్టిఫై చేస్తుందన్నది వేచి చూడాల్సిన విషయమే. 'నేనేమీ పోర్న్‌ సినిమాల్లో నటించలేదు' అని షకీలా చెబుతున్నా, ఆమెకు సంబంధించిన ఆ తరహా వీడియోలు ఇప్పటికీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే వున్నాయి. మలయాళ సూపర్‌ స్టార్స్‌ మోహన్‌లాల్‌ తదితరులు సైతం షకీలా సినిమాల్ని చూసి భయపడిన సందర్భాలున్నాయంటే, ఏ స్థాయిలో మలయాళ సినీ మార్కెట్‌ని షకీలా తన కనుసన్నల్లో నడిపిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రమంలో అనేక రాజకీయాలు, షకీలా ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీశాయి. అవన్నీ షకీలా సినిమాల్లో వుంటాయట. రిచా సైతం ఈ సినిమాలో బోల్డ్‌గా కన్పించాల్సి వస్తే తనకేమీ అభ్యంతరం లేదంటూనే, షకీలా స్ట్రగుల్‌ ఆమె మాటల్లో విన్నాక సినిమాపై తనకు చాలా గౌరవం పెరిగిందని చెబుతోంది.