దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం సినిమా అనౌన్స్ చేయగానే సగటు సినిమా జనాలు అందరికీ ఓ ఐడియా వచ్చేసింది. అందులోనూ శతమానం భవతి సినిమా తరువాత అది కూడా అదే డైరక్టర్ సతీష్ విగ్నేశ్ డైరక్షన్ లో అనేసరికి, అలాగే, అదే విధంగా ఫ్యామిలీ లైన్ లో వుంటుందని అంచనా వేసేసారు. పైగా పెళ్లిళ్లు, వాటి వ్యవహారం అని వార్తలు వచ్చేసరికి, పెళ్లిళ్లపై పాట ఇచ్చేసరికి, విడుదల చేయబోయే టీజర్ కూడా అలాగే వుంటుందని అనుకున్నారు.
కానీ తీరా నిన్న వచ్చిన టీజర్ వేరుగా వుంది. పక్కా యూత్ ఫుల్ సినిమా అన్నట్లుగా టీజర్ ను కట్ చేసారు. సినిమా కలర్ ఫుల్ గా, విజువల్స్ కళ్లకు ఇంపుగా వుండడం ఓకె. దిల్ రాజు నిర్మాణం అంటే ఆ రేంజ్ ఎలాగూ వుంటుంది. రాశీఖన్నా ఈ మధ్య చాలా మాంచి లుక్స్ తో కనిపించడం కూడా ప్లస్ అయింది. తొలిప్రేమ టచ్ కొంచెం కనిపిస్తోంది.
మొత్తంమీద టీజర్ కాన్సెప్ట్, డైలాగులు అన్నీ చూసుకుంటే శ్రీనివాసకళ్యాణం యూనిట్ కావాలని ఈ టీజర్ ను ఈ విధంగా కట్ చేసినట్లు కనిపిస్తోంది. దిల్ రాజు సినిమా, శతమానం భవితి డైరక్టర్, శ్రీనివాస కళ్యాణం టైటిల్ అంటే ఫ్యామిలీలు ఎలాగూ వస్తాయి. కానీ యూత్ ను కూడా లాక్కురావాలి కదా? అందుకే ఈ విధమైన టీజర్ ను వదిలినట్లు కనిపిస్తోంది.
ఏమైనా అందరూ ఒకటి అనుకుంటే, దిల్ రాజు మరోటి వదిలి, బాల్ స్పిన్ చేసాడు.