శ్రీనువైట్ల అంటే మహేష్ కు మరుపురాని హిట్ దూకుడు ఇచ్చాడు.. మరవలేని డిజాస్టర్ ఆగడు ఇచ్చారు. ఆ రికార్డు ఆయనకే సొంతం. అలాంటి డైరక్టర్ అడగక, అడగక మహేష్ ను ఓ కోరిక కోరినట్లు తెలుస్తోంది. కానీ దానిని మహేష్ సున్నితంగా తిరస్కరించినట్లు వినిపిస్తోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే, దొరక్క దొరక్క శ్రీనువైట్లకు ఓ భారీ సినిమా చేతిలోకి వచ్చింది. అమర్ అక్బర్ ఆంథోని అంటూ రవితేజతో సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో చైల్డ్ వుడ్ ఎపిసోడ్ కీలకం అంట. ఎంత కీలకం అంటే ఈ ఎపిసోడ్ కోసమే ఏకంగా అమెరికాలో 20 రోజులు షెడ్యూలు చేసినట్లు టాలీవుడ్ టాక్. ఇరవై రోజులకు ఎంత ఫుటేజ్ వస్తుంది? సినిమాలో ఏ మేరకు వుంటుంది? అన్న క్వశ్చన్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ అవి కాదు విషయం.
ఈ హీరో చైల్డ్ హుడ్ క్యారెక్టర్ ను మహేష్ కొడుకు గౌతమ్ చేత చేయిద్దామని అనుకున్నాడట శ్రీనువైట్ల. ఈ విషయాన్ని హీరో మహేష్ కు చెబితే, సున్నితంగా తిరస్కరించాడట. ఇప్పుడు గౌతమ్ చదువులో బిజీగా వున్నాడని, మళ్లీ దృష్టి మళ్లుతుందని క్లారిటీ ఇచ్చాడట. దాంతో శ్రీనువైట్ల ఆల్టర్ నేటివ్ చూసుకున్నట్లు తెలుస్తోంది.
ఏమైనా మహేష్ కరెక్ట్ గానే చెప్పారు కానీ, చిన్నప్పటి నుంచి కెమేరాను ఫేస్ చేయడం అలవాటు చేయడం వల్లనే కదా, మహేష్ యాక్టింగ్ స్కిల్స్ ఇంతలా అలవాటు చేసుకున్నాడు. ఏమైనా ఫాదర్ గా కృష్ణ ఆలోచనలు వేరు, మహేష్ ఆలోచనలు వేరు అనుకోవాలి.