సాధారణంగా ఏ సినిమాకు అయినా సిట్యువేషన్ అనుకుని, ఆపై సాంగ్ ను ట్యూన్ చేయించి, రాయించి, రికార్డింగ్ చేయిస్తారు. ఆ తరువాత షూటింగ్ కు వెళ్లి, ఇన్ డోర్ లోనో, అవుట్ డోర్ లోనో పాటను బట్టి షూట్ చేస్తారు. కానీ సీనియర్ దర్శకుడు వంశీ రకరకాల ప్రయోగాలు చేసేవారు. తన స్టయిల్ లో పాట మొత్తం తీసేసి, ఆ తరవాత దానికి తగినట్లు చిత్రీకరణ చేసిన సందర్భాలు కూడా వున్నాయి. ఆయన కాకుండా ఇలా చేసినవారు దాదాపు లేనట్లే.
అయితే లేటెస్ట్ గా ఓ కొత్త దర్శకుడు మళ్లీ అదే ప్రయోగం చేసారు. భవ్య క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న `ఓ పిట్ట కథ` సినిమా కు చెందు ముద్దు దర్శకుడు. ఈ సినిమాలో “ఏమై పోతానే.. మనసిక ఆగేలా లేదే“ అంటూ సాగే మెలోడీ పాటను `విడుదల చేసారు. ఈ పాటను ఈ పాటను అమలాపురం, కాకినాడ పరిసరాల్లో చిత్రీకరించారు. మూవీలో సన్నివేశం మూడ్ కి తగ్గట్టుగా అక్కడ లొకేషన్లలో విజువల్స్ ని ముదుగా తెరకెక్కించేసారు. తొలుత విజువల్స్ షూట్ చేశాకే హైదరాబాద్ లో పాటకు ట్యూన్, లిరిక్స్ తయారు చేయించారు.
ఈ సందర్బంగా దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. “ఒక విలేజ్లో జరిగే కథ ఇది. ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తూనే.. ఏం జరుగుతోందో అనే ఉత్కంఠను కలిగిస్తుంది. పతాక సన్నివేశాల వరకూ అదే థ్రిల్ కొనసాగుతుంది. ట్విస్టులు థ్రిల్ కలిగిస్తాయి. స్క్రీన్ ప్లే ప్రధానంగా తెరకెక్కించాం“ అని అన్నారు.విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి, తదితరులు ఈ చిత్రంలో నటించారు.