షార్ట్ ఫిలిమ్..బిగ్ స్టొరీ

విశాఖ హుద్ హుద్ బాధితులకు సహాయం అందించేవారిని మరింత చైతన్య వంతం చేయడానికి రాజమౌళి చిన్నప్రచార చిత్రం రూపొందించారు. రాజీవ్ మీనన్ తదితరులు సాయం పట్టారు. షేర్ ది స్పిరిట్ ఆఫ్ దీపావళి అన్నది…

విశాఖ హుద్ హుద్ బాధితులకు సహాయం అందించేవారిని మరింత చైతన్య వంతం చేయడానికి రాజమౌళి చిన్నప్రచార చిత్రం రూపొందించారు. రాజీవ్ మీనన్ తదితరులు సాయం పట్టారు. షేర్ ది స్పిరిట్ ఆఫ్ దీపావళి అన్నది టైటిల్. స్వామిరారాలో నటించిన బాల నటుడు, థర్టీ ఇయర్స్ పృధ్వీ తదితరులు నటించారు. దీపావళి ఖర్చు కొంత తగ్గించుకుని, దానిని తుపాను బాధితుల కోసం సిఎమ్ రిలీఫ్ ఫండ్ కు ఇవ్వమనే సందేశం ఈ సినిమా కాన్సెప్ట్. 

అయితే రాజమౌళి పేరు వాడారు కాబట్టి నెటిజన్లు, ఆయన అంటే అభిమానం వున్న ప్రతి ఒక్కరూ ఆహొ…ఓహో అంటున్నారు. కానీ నిజాయతీగా చూస్తే అంత సీన్ వున్నట్లు కనిపించలేదు. సిఎమ్ రిలీఫ్ ఫండ్ కు ప్రచార చిత్రం తీసి ఇచ్చినట్లుంది తప్ప.  పైగా కొద్ది రోజుల క్రితం సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన షార్ట్ ఫిలిమ్ కాన్సెప్ట్ నే మార్చి దీనికోసం వాడినట్లు, అదే స్క్రీన్ ప్లే ఫాలో అయిపోయినట్లు కనిపించింది. అక్కడా అదే రివర్స్ ప్లే టైపు..ఇక్కడా అదే టైపు..రెండు మూడు సీన్లు. ఆఖరి సీన్ నుంచి మళ్లీ ముందుకు..రాజమౌళి పేరు వాడాలి అంటే దానికి ఓ లెవెల్ వుండాలి.ఎందుకంటే ఆయన స్టామినా వేరు, అయిడియాలు వేరుగావుంటాయి.

ఇదంతా ఇలా వుంటే..ఈ వీడియో ను రాజీవ్ మీనన్, ఆర్ట్ డైరక్టర్ రవీంద్ర కలిసి తయారుచేసారట. మొదట మీడియాకు షార్ట్ ఫిలిం పంపించినపుడు రాజీవ మీనన్ ప్రస్తావన కనిపించలేదు. మళ్లీ రెండో సారి మెయిల్ వచ్చినపుడు అందులో డైరక్టర్ గా రాజీవ్ మీనన్ పేరు వుంది. ఈ రెండింటి నడుమ కాస్త విషయం వుందట.

రాజమౌళి ఈ పనిని రాజీవ్ మీనన్ కు, రవీంద్రకు అప్పగించారట.  చాలా తక్కువ చేసేయమని. అయితే కాస్త బాగానే ఖర్చయిందట. పైగా రాజమౌళి ప్రొడక్షన్ ఆపీసు వాళ్లు కూడా ఏమాత్రం సహకరించకపోవడంతో తమ జనాన్ని వాడుకోవాల్సి వచ్చిందట.  దానికి తోడు విడియో లో కనిపించే దీపావళి దుకాణాన్ని స్టూడియోలో సెట్ వేయాల్సి వచ్చిందట. 

పైగా నటులను పెట్టుకున్నారు. అసిస్టెంట్లు హంగామా తప్పదు. ఉచితంగా చేసినా, కనీసపు ఖర్చులు వుంటాయి కదా.. తీరా చేసి విడియో మీడియాకు వచ్చేసరికి ఇద్దరి  పేర్లు లేవు..విడియోలో కూడా క్రెడిట్ లైన్లు లేవు. అందరూ రాజమౌళిదే అనుకున్నారు. అహో..ఓహో అనేసారు. దీనికి తోడు వీరు తీసారని తెలిసిన వాళ్లు వీడియో చూసాక, ఎక్కడా వీరి పేర్లు లేకపోవడం చూసి అడగారని, ఆ మేరకు వీరు శోభు యార్లగడ్డను అడగడంతో అర్జెంట్ గా రెండో మెయిల్ ఇచ్చారని వినికిడి.

మొత్తానికి హుద్ హుద్ ను ప్రచారం చేసుకునేందుకు బాగానే వాడుకుంటున్నారు అందరూ. 

Click Here For Rajamouli's Short Film For Hudhud Victims