దాసరికి ఈ సారి రామ్ చరణ్ సమాధానమిస్తాడా?!

మెగా ఫ్యామిలీకి దర్శకుడు దాసరి నారాయణ రావుకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్నట్టుగానే ఉంది. ఇది వరకూ అనేక సార్లు సినిమా కార్యక్రమాల వేదికలపై ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకొన్న ఈ రెండు వర్గాల మధ్య…

మెగా ఫ్యామిలీకి దర్శకుడు దాసరి నారాయణ రావుకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్నట్టుగానే ఉంది. ఇది వరకూ అనేక సార్లు సినిమా కార్యక్రమాల వేదికలపై ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకొన్న ఈ రెండు వర్గాల మధ్య మరోసారి అలాంటి పరిస్థితి వచ్చింది. “లక్ష్మిరావే మా ఇంటికి'' అనే సినిమా ఆడియో విడుదల వేడుకలో దాసరి నారాయణ రావు ధూమ్ ధామ్ అన్నారు. చిన్న సినిమాను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఒక పెద్ద సినిమాపైన దాసరి ధ్వజమెత్తాడు. ఆ పెద్ద సినిమా పేరును ఆయన ప్రస్తావించకపోయినా.. చాలా సులభంగానే అర్థం చేసుకోవచ్చు అది “గోవిందుడు అందరి వాడూలే'' సినిమానే అని!

Watch Dasari Narayana Rao Speech

“లౌక్యం సినిమా అద్భుతమైన వసూళ్లు రాబడుతూ, ముందుకు వెళ్తున్న సమయంలో ఒక పెద్ద హీరో కోసం ఐదో రోజున 37 సెంటర్లలో ఆ సినిమాను తీసేశారు. కానీ, ఆ హీరో సినిమా మూడు రోజులు కూడా ఆడలేదు. దాంతో మళ్లీ “లౌక్యం' చిత్రాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టారు…'' అంటూ దాసరి ఆ హీరోపై, ఆ సినిమాపై చతుర్లాడాడు. 

లౌక్యం విడుదల అయిన ఐదో రోజు విడుదల అయిన తెలుగు సినిమా “గోవిందుడు అందరి వాడూలే'' ఈ సినిమ ఆపేరును దాసరి ప్రస్తావించలేదు. కానీ ఎద్దేవా అయితే చేశాడు. సినిమా గురించి మాత్రమే కాగా “ఒక హీరో కోసం'' అంటూ దాసరి చరణ్ ను కూడా ఇన్ వాల్వ్ చేసి మాట్లాడాడని అక్కడున్న వాళ్లందరికీ అర్థం అయ్యింది. ఆ హీరోకోసం లౌక్యం సినిమాను ఎత్తేశారు… ఆ సినిమా బాగోలేకపోవడంతో మళ్లీ లౌక్యం సినిమానే ప్రదర్శించారు. అంటూ దాసరి ఎద్దేవా కొనసాగింది. పనిలో పనిగా సినీ వారసత్వాలపై కూడా దాసరి ధ్వజమెత్తాడు. 

“వారసులు రావడం తప్పు కాదు.. అయితే అడ్డమైన సినిమాలు తీసి వాళ్లను జనాల మీద రుద్ధడమే తప్పు..'' అంటూ దాసరి ధ్వజమెత్తాడు! మరి మెగాఫ్యామిలీ ఆశా కిరణానికి ఎంత మంట పెట్టాలో దాసరి అంతా మంట పెట్టాడు. వెనుకటికి దాసరి  మాటలపై చరణ్ ఘాటుగానే స్పందించాడు. మరి ఈ సారి ఆయన స్పందన ఎలా ఉంటుందో!