శౌర్య.. బృహన్నల.. @నర్తనశాల

నర్తనశాల అనగానే గుర్తుకువచ్చేది బృహన్నల క్యారెక్టరే. అన్నగారు ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ ను అద్భుతంగా పోషించారు. మళ్లీ ఎవ్వరూ ట్రయ్ చేయలేదు. అయితే ఈ మధ్య సినిమాల్లో గే అనబడే బృహన్నల క్యారెక్టర్ ను…

నర్తనశాల అనగానే గుర్తుకువచ్చేది బృహన్నల క్యారెక్టరే. అన్నగారు ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ ను అద్భుతంగా పోషించారు. మళ్లీ ఎవ్వరూ ట్రయ్ చేయలేదు. అయితే ఈ మధ్య సినిమాల్లో గే అనబడే బృహన్నల క్యారెక్టర్ ను కామెడీకి తెగవాడేస్తున్నారు. కానీ ఫస్ట్ టైమ్ ఓ యంగ్ హీరో గేగా కనిపించబోతున్న సినిమా @నర్తనశాల. ఈ సినిమా ఆగస్టు 30న విడదుల కాబోతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. అమ్మాయిల మధ్య పెరిగి, అమ్మాయిల మధ్యే తిరిగి, తిరిగిన అబ్బాయికి అమ్మాయి అంటే ఫీలింగ్స్ లేకపోవడం, గేగా ప్రవర్తించడం వంటి కాన్సెప్ట్ టీజర్ లో తొంగిచూస్తోంది. ఛలో సినిమాతో హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పైనే ఈ సినిమా కూడా తయారైంది.

టీజర్ లో ఫన్, కలర్ ఫుల్ సీన్స్ తప్ప, కథను పెద్దగా బయట పెట్టలేదు. టైటిల్ నర్తనశాల కాబట్టి, హీరో గేగా కనిపించడానికి అసలు కారణం ఏదో వుండే వుండాలి. అది తెలియాలంటే కనీసం ట్రయిలర్ రావాలేమో? ఇప్పటికి అయితే వచ్చిన టీజర్ ఓకె అనిపించుకుంటుంది. అందులో సందేహంలేదు.