వచ్చే ఏడాది ప్రభాస్ హీరోయిన్ పెళ్లి?

ప్రభాస్ సరసన సాహో సినిమా చేస్తున్న శ్రద్ధాకపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందట. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ప్రధమార్థంలో శ్రద్ధాకపూర్ పెళ్లి ఉంటుందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కెరీర్ స్మూత్ గా…

ప్రభాస్ సరసన సాహో సినిమా చేస్తున్న శ్రద్ధాకపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందట. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ప్రధమార్థంలో శ్రద్ధాకపూర్ పెళ్లి ఉంటుందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కెరీర్ స్మూత్ గా సాగిపోతున్న టైమ్ లో శ్రద్ధాకపూర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఓ రీజన్ ఉంది.

గతంలో దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్ తో డేటింగ్ చేసింది శ్రద్ధాకపూర్. కానీ వాళ్ల డేటింగ్ బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్త బయటకొచ్చిన సమయానికే విడిపోయారు. ఆ తర్వాత సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోషన్ శ్రేష్ఠకు దగ్గరైంది శ్రద్ధ. అతడ్నే పెళ్లి చేసుకుంటుందంటూ ప్రస్తుతం పుకార్లు వినిపిస్తున్నాయి.

తల్లిదండ్రుల నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో వచ్చే ఏడాది శ్రద్ధాకపూర్ పెళ్లి చేసుకోవడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. దీనికితోడు బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి కూడా శ్రద్ధా తప్పుకోవడం పెళ్లి పుకార్లకు మరింత ఊతమిచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజైన విషయం తెలిసిందే.

33 ఏళ్ల శ్రద్ధాకపూర్ చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. వీటిలో సాహో ఒకటి. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి రేంజ్ లో ఈ సినిమా కూడా బాలీవుడ్ లో హిట్ అయితే, శ్రద్ధ తన మనసు మార్చుకుంటుందేమో చూడాలి.

సీమ సింహం ఎవరు? ఫిరాయింపుల ప్రభావం ఎంత?