Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

థమన్ కు సమంత మెసేజ్

థమన్ కు సమంత మెసేజ్

టాలీవుడ్ లో అందరితో మంచి రిలేషన్లు మెయింటెయిన్ చేయడంలో హీరోయిన్ సమంత ముందు వుంటుంది. ఆమె లేటెస్ట్ గా నటించిన సినిమా మజిలీ. ఈ సినిమా ఏప్రియల్ 5న విడుదల కావాల్సి వుంది. అయితే ఈ సినిమా అనుకోని చిక్కుల్లో పడింది. మ్యూజిక్ డైరక్టర్ గోపీసుందర్ మొత్తం రెమ్యూనిరేషన్ తీసుకుని, రీ రికార్డింగ్ చేయకుండా హ్యాండ్ ఇచ్చాడు. దాంతో అదనపు ఖర్చు భరించి, ఇప్పుడు థమన్ కు సినిమాను అప్పగించారు.

అసలే ఫీల్ గుడ్ సబ్జెక్ట్ సినిమా. రీరికార్డింగ్ చాలా కీలకం. కానీ టైమ్ చూస్తే గట్టిగా రెండువారాలు లేదు. థమన్ ఏం చేస్తాడో అన్న వర్రీ వుంటుందిగా? అందుకే కావచ్చు... సమంత ఓ మెసేజ్ ను థమన్ కు పంపించినట్లు తెలుస్తోంది. తనకు-చైతూకు పెళ్లి అయిన తరువాత జోడీగా వస్తున్న ఫస్ట్ సినిమా అని, దీనికి మాంచి ఆర్ ఆర్ ఇవ్వాలని, సినిమాను ఆర్ ఆర్ తో నిలబెట్టే బాధ్యత థమన్ దే అంటూ సమంత మాంచి మెసేజ్ ఒకటి పంపించినట్లు తెలుస్తోంది.

అక్కినేని వారి కోడలు, హీరోయిన్ సమంత ఇలా మెసేజ్ పెట్టిన తరవాత థమన్ ఇంక సినిమాను ఏ రేంజ్ లో ట్రీట్ చేస్తాడో ఊహించుకోవచ్చు. అసలే ఈ మధ్య ఫీల్ గుడ్ సినిమాలకు ఆర్ ఆర్ ఇవ్వడంలో థమన్ మంచి మార్కులు సంపాదిస్తున్నాడు. అందువల్ల మజిలీకి కూడా న్యాయం చేస్తాడనే అనుకోవాలి.

సీమ సింహం ఎవరు? ఫిరాయింపుల ప్రభావం ఎంత?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?