Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ తల్లిగా టబు?

బన్నీ తల్లిగా టబు?

టబును తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మర్చిపోలేరు. నిన్నే పెళ్లాడుతా దగ్గర నుంచి అనేక సినిమాల్లో ఆమె వొలకబోసిన హోయలు జనాల కళ్ల ముందే వుంది ఇంకా. అయితే చాలాకాలం తరువాత తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ఈసారి అమ్మాయిగా కాదు, అమ్మగా. నదియాను, కుష్బూను సీనియర్ క్యారెక్టర్లలో చూపించిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి తన తరువాత సినిమాలో టబును చూపించాలని డిసైడ్ అయినట్ల బోగట్టా.

అయితే ఇంకా ఈవిషయంలో టబు సైడ్ నుంచి కన్ ఫర్మేషన్ వచ్చిందా లేదా అన్నది తెలియదు. ప్రస్తుతానికి బన్నీ-త్రివిక్రమ్ సినిమా యూనిట్ లో మాత్రం ఈ ఆప్షన్ ఒకటి వుంది. టబును సినిమాలో బన్నీకి తల్లిగా కీలకపాత్రలోకి తీసుకోవాలనుకుంటున్నారు.

అయితే టబుకు కథ చెప్పడం, ఆమె చేత ఓకె అనిపించుకోవడం మాత్రం పెండింగ్ లో వున్నాయి. ఆ ఫార్మాలిటీ పూర్తయితే ఆ విషయం బయటకు అఫీషియల్ గా వస్తుంది. ఏప్రియల్ ఫస్ట్ వీల్ లో ప్రారంభమయ్యే బన్నీ-త్రివిక్రమ్ సినిమా వారంరోజులు ఫస్ట్ షెడ్యూలుగా వుంటుంది.

ఇప్పటికే ఈసినిమా కోసం జయరామ్ (మలయాళం), సత్యరాజ్(తమిళం) రావు రమేష్, సీనియర్ నరేష్, రాజేంద్రప్రసాద్ వంటి వారిని తీసుకున్నారు. ఇప్పుడు ఈ స్టార్ కాస్ట్ కు టబు తోడవుతుందన్నమాట.

సీమ సింహం ఎవరు? ఫిరాయింపుల ప్రభావం ఎంత?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?