Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నితిన్ తో రమేష్ వర్మ

నితిన్ తో రమేష్ వర్మ

హీరో నితిన్ మళ్లీ లైన్లోకి వస్తున్నారు. ఈనెలాఖరున బర్త్ డే సందర్భంగా ఒక సినిమా ప్రకటిస్తున్నారు. వెంకీ కుడుముల డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే భీష్మ సినిమాను ఆ రోజు ప్రకటిస్తారు. ఏప్రియల్ లో ఉగాది నాటి నుంచి ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టార్ కాస్ట్ సెలక్షన్ కూడా రెడీ అయింది.

ఇదిలావుంటే నితిన్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రమేష్ వర్మ డైరక్షన్ లో కోనేరు సత్యనారాయణ నిర్మించే సినిమాకు కూడా నితిన్ ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రమేష్ వర్మ ఇదే బ్యానర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాక్షసన్ రీమేక్ చేస్తున్నారు.

దాని తరువాత ఈ సినిమా వుండే అవకాశం వుంది. ఇందుకోసం గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ కు చెప్పిన ప్రేమకథనే నితిన్ దగ్గరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ రెండూకాక సూర్యప్రతాప్ డైరక్షన్ లో గీతా-2 బ్యానర్ లో నితిన్ ఓ సినిమా చేయాల్సి వుంది.

సీమ సింహం ఎవరు? ఫిరాయింపుల ప్రభావం ఎంత?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?